అమరావతి :  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  బీజేపీ పార్టీ  రాజ్య సభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు బహిరంగ  లేఖ రాశారు. తిరుపతి ఎయిర్ పోర్టుకు ఉద్దేశ్యపూర్వకంగా నీటి సరఫరా నిలిపివేత పై ఈ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు  జీవీఎల్ నరసింహరావు. విమానాశ్రయానికి నీటి సరఫరా నిలిపివేతపై విచారణ చేపట్టాలని కోరారు  జీవీఎల్ నరసింహరావు. ఈ వారం ప్రారంభంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు విమానాశ్రయ సిబ్బంది నివాస గృహాలకు నీటి సరఫరాను అకస్మాత్తుగా నిలిపివేశారని లేఖలో వెల్లడించారు  జీవీఎల్ నరసింహరావు. జనవరి 10న తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ హఠాత్తుగా విమానాశ్రయానికి నీటి సరఫరాను నిలిపివేసిందన్నారు  జీవీఎల్ నర సింహరావు. 

అధికార వైసీపీకి చెందిన పార్టీకి చెందిన కొంతమందికి విమానాశ్రయ ప్రవేశం నిరాకరించారని లేఖ ద్వారా వివరించారు  జీవీఎల్ నరసింహరావు. ఆ తర్వాత రోజు క్వార్టర్లకు నీటి సరఫరాను నిలిపేశారని.. ఈ ప్రతీకార ఆలోచనా రహిత చర్య తిరుపతి విమానాశ్రయానికి వెళ్లే వందలాది మంది ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేసిందన్నారు చెప్పారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  బీజేపీ పార్టీ  రాజ్య సభ సభ్యులు  జీవీఎల్ నరసింహరావు. నివాస గృహాల్లోని కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులను కలిగించిందన్నారు  జీవీఎల్ నరసింహరావు. నివాస గృహాలకు వెళ్లే రోడ్లు అకస్మాత్తుగా తవ్వడంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతోపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు  జీవీఎల్ నరసింహరావు. మరమ్మతుల వల్లే సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఈ వివరణ అవాస్తవమని స్పష్టం చేశారు  జీవీఎల్ నరసింహరావు. వైఎస్సార్‌సీపీ స్థానిక నేతలు ప్రతీకార చర్యగా దీన్ని చేశారన్నారు  జీవీఎల్ నరసింహరావు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి, స్వతంత్ర కాలపరిమితితో కూడిన విచారణ చేపట్టాలని కోరారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  బీజేపీ పార్టీ  రాజ్య సభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp