ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ని ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా టిడిపి - బిజెపి కూటమికి సపోర్ట్ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది.

పవన్ రెండు సంవత్సరాలపాటు చంద్రబాబుతో ఉన్నారు. ఇక గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన పవన్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు శాతం ఓట్లు సాధించిన ప‌వ‌న్‌ ఒక్క రాజోలు సీటుతో మాత్రమే సరిపెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పుడు ఎవరికి వారు వన్ సైడ్ లవ్ అంటూ చెబుతున్నా ఇప్పటికే పొత్తు గురించి ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ సైతం టిడిపితో పొత్తుకు ఓకే చెప్పారని... ప్రతి జిల్లాకు నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు తమకు కేటాయించాలని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల్లో జనసేనకు 52 సీట్లు కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు తెలుగుదేశానికి గరిష్టంగా 125 సీట్లు మాత్రమే దక్కుతాయి. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 సీట్లను పొత్తులో భాగంగా కోల్పోవలసి వస్తే అది తెలుగుదేశం పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది.

జ‌న‌సేన పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ జనసేనకు సపోర్ట్ చేస్తుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా 2024 ఎన్నికల్లో జనసేన - టీడీపీ మధ్య పొత్తు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసి చంద్రబాబు కు చుక్కలు చూపిస్తారు అనటం లో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: