రాజ‌కీయాలు ఎలాఉంటాయో తెలియ‌దు.సినిమాలు ఎందుకు స‌క్సెస్ అవుతాయో కూడా కొన్నిసార్లు తెలియ‌దు.కానీ రాజ‌కీయం క‌న్నా సినిమానే త‌క్కువ రంగులు చూపిస్తుంది.రంగులు వెల‌సిపోయే వేళ నిజం ఒక‌టి రాజ‌కీయం ప‌ట్టి చూపిస్తుంది.అందుకే ఏది ?ఎప్పుడు? ఎలా? ఉంటుందో రాజకీయాల్లో చెప్ప‌డ‌మే క‌ష్టం.కొన్నిసార్లు అనుకోనివి హాయిగా జ‌రిగిపోతుంటాయి.మాయ‌లా క‌ద‌లిపోతుంటాయి.అందుకే రాజ‌కీయంలో అనూహ్యం అనుకున్న‌వి ఆశ్చ‌ర్యం అయి ఉంటాయి..అద్భుతం అయి ఉంటాయి.

అందుకే రాజ‌కీయంలో నిన్న‌టి ప‌రిణామం క‌న్నా ఇవాళ జ‌రిగిన పరిణామ‌మే పెద్ద కుదుపుగా ఉంటుంది. తాజాగా చిరుతో జ‌గ‌న్ భేటీ  సంద‌ర్భంగా వైసీపీ గూటికి చిరు? అని ఓ టైటిల్ తో హెరాల్డ్ మీడియా ఓ వార్త అందించింది.ఆ మాట‌కు కొన‌సాగింపు అన్న అర్థం ధ్వ‌నించేలా ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ అప్డేట్ ఇచ్చింది.అంటే త్వ‌ర‌లో చిరు మ‌ళ్లీ ఎంపీ కావ‌డం ఖాయం.త‌రువాత మంత్రి కావ‌డం కూడా ఖాయం. ఎందుకంటే ఎప్ప‌టినుంచో ఎన్డీఏ స‌ర్కారు ప్ర‌తినిధులు జ‌గ‌న్ కు రెండు కేంద్ర మంత్రి ప‌ద‌వులు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంది కానీ జ‌గ‌న్ వ‌ద్దంటున్నారు.అన్నీ బాగుంటే ఒక స‌హాయ మంత్రి ప‌ద‌వికి చిరును ఎంపిక చేయ‌వ‌చ్చు కూడా! లేదా అంత‌కుమించి మంచి స్థానంలో మోడీ మంత్రివర్గంలో ఆయ‌న ఉండ‌వ‌చ్చు.చెప్పలేం.. చెప్పేందుకు ఆస్కార‌మే లేదు.


సంక్రాంతి సంద‌ళ్ల‌లో అంతా ఉన్నారు. మ‌రోవైపు రాజ‌కీయ సంక్రాంతి,సినిమా సంక్రాంతి నిన్న‌టి రోజు ఒకేసారి వ‌చ్చేయి.దీంతో అటు ఇండ‌స్ట్రీలోనూ,ఇటు ఆంధ్రావ‌ని రాజ‌కీయాల్లోనూ కొన్ని మంచి మాట‌లు వినిపించాయి.కొంద‌రి భ‌యాందోళ‌న‌లు కూడా వినిపించాయి.ముఖ్యంగా చిరుతో జ‌గ‌న్ భేటీ సంద‌ర్భంలో ఓ కీల‌క నిర్ణయం వెలువ‌రించార‌ని తెలుస్తోంది.అదేంటంటే ఆయ‌న‌కు రాజ్య స‌భ టికెట్ ఆఫ‌ర్ చేశార‌ని, వ‌చ్చే జూన్లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ఆయ‌న‌ను బ‌రిలో దింపి నెగ్గించుకోవ‌డం ఖాయం అని తెలుస్తోంది.ఇవ‌న్నీ ఏపీ సీఎంఓ నిర్థారించిన విష‌యాలు కాకున్నా సూచ‌న ప్రాయంగా వెల్ల‌డించిన విష‌యాలు అని మాత్రం రాయాలి.వీటినే ఇవాళ దిగ్గ‌జ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త రూపంలో వెలువ‌రించింది.నిన్న‌టి భేటీ సంద‌ర్భంగాసినిమాల క‌న్నా రాజ‌కీయం పైనే ఎక్కువ చ‌ర్చ జ‌రిగింద‌ని కూడా ఆ మీడియా వార్త లో ప్ర‌స్తావించింది.ఇదే క‌నుక జ‌రిగితే రాష్ట్ర రాజ‌కీయాల్లో మేలి మ‌లుపు..మ‌రో కుదుపు ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: