కొంచెం ఆలోచించినా కూడా రాజ‌కీయం ఇప్పుడు అర్థం అయిన విధంగా రేపు ఉండ‌దు.ఉండ‌బోదు కూడా! ఆ విధంగా రాజ‌కీయాల‌కు సంబంధించి ప్ర‌తిరోజూ ఎవ‌రికి వారు త‌మ‌ని తాము కొత్త‌గా నిర్వ‌చ‌నం ఇచ్చుకోవాలి.తాజాగా వైసీపీ బ‌లోపేతానికి ఓ స్టార్ క్యాంపైన‌ర్ కావాల‌ని కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌గా చిరును చూపించి,మంచి మైలేజీ ద‌క్కించుకోవాల‌ని యోచిస్తూ,జ‌గ‌న్ ఓ ప్లాన్ వేస్తున్నార‌ని తెలుస్తోంది.అన్నీ కుదిరితే రాజ్య‌స‌భ‌కు ఆయ‌న‌ను పంప‌నున్నారు.అయితే జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఎలా ఉన్నా అస‌లు నిన్న‌టి వేళ ప‌రిణామాల‌పై మాత్రం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కాస్త సానుకూలంగానే ఉన్నారు.


భేటీ త‌రువాత అయినా సినీ ప‌రిశ్ర‌మ‌పై దాడి ఆగిపోవాల‌ని తాను భావిస్తున్నాన‌ని అన్నారు. ఈ మాట కాస్త హుందాగానే ఉంది.అదేవిధంగా మ‌రో మాట కూడా చెప్పారు కొంద‌రు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం త‌ప్పు అని చెబుతూ,వాళ్ల‌కే ఒళ్లు  బ‌లిసింద‌ని పేర్కొంటూ కౌంట‌ర్ ఇచ్చారు.ఇవ‌న్నీ ఎలా ఉన్నా చిరుకోసం ఓ విధంగా జ‌గ‌న్ సాహ‌సం చేయ‌నున్నారు.అందుకు నిరంజ‌న్ రెడ్డి స‌హ‌క‌రిస్తున్నారు.అందుకు మిగ‌తా ప‌రిణామాలు కూడా కార‌ణం అయి ఉన్నాయి.అన్న‌ది ఓ విధంగా ఇప్ప‌టికి తేలిన విష‌యం. రఘురామ చెప్పిన విధంగా ఆచార్య నిర్మాతే ఇదంతా జ‌రిగినా ఆఖ‌రులో ఇండస్ట్రీకి మేలు చేసే నిర్ణ‌యం ఒక‌టి జ‌గ‌న్ వెలువ‌రిస్తే చాలు.తెర వెనుక ఎవ్వ‌రు ఉన్నా స‌మ‌స్య ప‌రిష్కారం అయితే మేలు.


వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఎలా ఉన్నా ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల కోసం ఎవ‌రి పంతం లో వారున్నారు.ప‌దవులే ధ్యేయంగా ప‌నిచేసే వారంతా త‌న‌కు వ‌ద్ద‌ని, క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారే కావాల‌ని ఏ పార్టీ అధినేత అయినా ఏక వాక్యంగా ఇదే మాట చెబుతున్నారు.తాజాగా చిరుతో జ‌గ‌న్ భేటీ వెనుక ఆచార్య నిర్మాత ఉన్నార‌ని రెబ‌ల్ ఎంపీ ర‌ఘు రామ కృష్ణంరాజు చెప్పిన మాట‌లు కాస్త ఆశ్చ‌ర్యం క‌లిగించేవిగానే ఉన్నాయి.జ‌గ‌న్ లాయ‌ర్ అయిన నిరంజ‌న్ రెడ్డి కార‌ణంగానే జ‌గ‌న్ నుంచి చిరుకు పిలుపు వ‌చ్చింద‌ని అంటున్నారీయ‌న.ఈ మాట ఎలా ఉన్నా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే జ‌గ‌న్ కొన్ని సాహ‌సోపేత నిర్ణ‌యాలు వెలువ‌రించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.ఇందులో భాగంగానే చిరును రాజ్య‌స‌భ‌కు పంపాల‌నుకోవ‌డం.అదేవిధంగా ఆయ‌న్నొక స్టార్ క్యాంపైన‌ర్ గా వాడుకోవ‌డం.ఈ క్ర‌మంలో పార్టీలో అనూహ్య మార్పులు వ‌చ్చినా కూడా జ‌గ‌న్ మాత్రం తాను చేయాల‌నుకున్న‌దే చేసి మ‌రోసారి సాహ‌సి అని అనిపించుకోనున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: