మంత్రి కొడుకు,ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోతుంటారు. మంత్రి కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ముందూ వెనుకా చూడ‌కుండా ఏవేవో మాట్లాడుతుంటారు. మంత్రి కొడుకు అయినా ఎమ్మెల్యే కొడుకు అయినా అధికారం ఉన్నంత వ‌ర‌కే అన్న క‌నీస స్పృహ లేకుండా వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నార‌న్న విమ‌ర్శ‌ను త‌రుచూ టీడీపీ నుంచి ఎదుర్కొంటున్నారు.అధికారం లేక‌పోతే క‌నీస గౌర‌వం ద‌క్క‌డం కూడా క‌ష్ట‌మేన‌ని కూడా విప‌క్షం హిత‌వు చెబుతోంది. అయినా వినిపించుకుంటేనా? పుత్ర ర‌త్నాల‌ను క్ర‌మశిక్ష‌ణ‌తో ఉంచ‌క, ప‌బ్లిక్ లో ఎలా న‌డుచుకోవాలో నేర్ప‌క వాళ్లేం చెబితే అదే వేదం అన్న విధంగా ప్ర‌వ‌ర్తిస్తూ వార్త‌ల్లో ఒకింత ఎక్కువ‌గానే నిలుస్తున్నారు.

ఇటీవ‌ల వ‌రుస వివాదాల‌తో వైసీపీ మంచి పేరు కాస్త చెడ్డ‌గా మారిపోతోంది. ఓ వైపు గూండాయిజం మ‌రోవైపు మైనింగ్ ప్రాసెస్ ఇంకోవైపు త‌గువులూ తంటాలు ఇవ‌న్నీ ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క‌నీసం ఆలోచ‌న‌కు కూడా తూగ‌కుండా ప‌నులు చేసుకుంటూ వెళ్తున్నార‌ని కొంద‌రు ఆపార్టీని విమ‌ర్శిస్తున్నారు.దీంతో స‌మ‌స్యలు ప‌రిష్కారానికి నోచుకోవ‌డం లేదు..స‌రిక‌దా! కొత్త వివాదాలు వ‌చ్చి ప‌డుతున్నాయి. తిరుప‌తి విమానాశ్ర‌యంలో ఘ‌ట‌న‌పై ఎమ్మెల్యే భూమన స్పందించ‌క‌పోవ‌డంతోనే సిస‌లు వివాద‌మంతా!

తిరుప‌తి విమానాశ్రయానికి సంబంధించి ఇటీవ‌ల ఓ గొడ‌వ జ‌రిగింది.ఇటీవ‌ల మంత్రి బొత్స రాక కార‌ణంగా తిరుప‌తి ఎయిర్ పోర్ట్ ద‌గ్గ‌ర  వైసీపీ ఎమ్మెల్యే భూమ‌న కరుణాక‌ర్ రెడ్డి కుమారుడు,డిప్యూటీ మేయ‌ర్ అభిన‌య్ రెడ్డి హ‌డావుడి చేసిన సంగ‌తి తెలిసిందే! మంత్రి బొత్స ను ఆహ్వానించేందుకు భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌ల‌తో వెళ్లిన అభిన‌య్ ను సెక్యూరిటీ వ‌ర్గాలు అడ్డుకున్నాయి.దీంతో కోపంతో ఊగిపోయిన అభిన‌య్ అక్క‌డున్న వారిని నోటికి వ‌చ్చిన విధంగా తిట్టార‌ని కొంద‌రు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు కు వెళ్లే తాగు నీటి పైప్ లైన్ ను కూడా క‌ట్ చేశారు. దీనిపై కేంద్రం సీరియ‌స్ అయింది. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తూ రాజ్య స‌భ స‌భ్యులు జీవీఎల్ న‌ర‌సింహారావు  కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఈ లేఖ‌ను చ‌దివేక  సంబంధిత శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా త‌న స్పంద‌న చెప్పారు. త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని సామాజిక మాధ్య‌మాల్లో హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp