ఏదైనా అధికారికంగా సమాచారం తెలిసి పోస్టు పెడతారో...లేక కావాలని క్రేజీగా పోస్ట్ పెట్టాలని అనుకుంటారో తెలియదు గానీ..తెలుగు తమ్ముళ్ళు ఒకోసారి ఎక్కువ ఆత్రంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. తమదైన శైలిలో పోస్టులు పెట్టేసి ఆనందపడతారు. అందులో వాస్తవం ఎంత ఉంటుందో ఎవరికి క్లారిటీ ఉండదు. ఈ మధ్య కాలంలో తమ్ముళ్ళు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు.

అదే సమయంలో వైసీపీ పని అయిపోయిందని, ఇంకా వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటూ పోస్టులు వేస్తున్నారు. అయితే ఇటీవల పీకే సర్వే అంటూ హడావిడి చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇటీవల సీక్రెట్ సర్వే చేశారని అందులో టీడీపీ అధికారంలోకి రాబోతుందని తేలిందని తమ్ముళ్ళు పోస్టులు పెడుతున్నారు. అలాగే టీడీపీ 111 సీట్లతో అధికారంలోకి వస్తుందని హడావిడి చేస్తున్నారు. అసలు పీకే సర్వే చేసినట్లు తమ్ముళ్ళకు ఎలా తెలిసింది...అసలు పీకే సర్వేలు చేయిస్తున్నారా? అంటే ఏమో అవన్నీ సీక్రెట్‌గా జరిగే వ్యవహారాలు..అవి తమ్ముళ్ళకు ఎలా తెలుస్తాయి. వైసీపీ అంత తేలికగా బయటకు పడనిస్తుందా? అనేది డౌటే.


సరే ఇవే కాదు...ఇంకా తమ్ముళ్ళు పలు రకాల ప్రచారం చేస్తున్నారు. ఇదే క్రమంలో గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టడానికి డైరక్ట్ బాలయ్య రంగంలోకి దిగుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే చాలా కాలం నుంచి ఈ ప్రచారం ఉంది. కానీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. అసలు బాలయ్య హిందూపురం సీటు వదిలి రావడం జరిగే పని కాదు...అలాంటప్పుడు గుడివాడలో బాలయ్య పోటీ చేస్తారని ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్ధం కాదు.

అయిన గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టడం చాలా కష్టమైన పని. ఎందుకంటే గుడివాడలో కొడాలి చాలా బలంగా ఉన్నారు. అలాంటప్పుడు గుడివాడలో బాలయ్యని తొందరపడి నిలబెట్టరు. కాబట్టి తమ్ముళ్ళ ఆరాటమే తప్ప...గుడివాడ బరిలో బాలయ్య దిగడం కష్టమని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: