ఈ మధ్య టీడీపీలో మొత్తం కార్యక్రమాలు చంద్రబాబే చూసుకుంటున్నారు. కింది స్థాయి క్యాడర్ నుంచి కలవడం దగ్గర నుంచి పొలిట్‌బ్యూరో సమావేశాలు వరకు బాబే అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. అలాగే ఏదైనా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉన్న చంద్రబాబే వెళుతున్నారు. ఇక తాజాగా మాచర్లలో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య జరిగిన వెంటనే..మాచర్లలో అడుగుపెట్టారు. వైసీపీ నేతల హత్యాకాండపై ఫైర్ అయ్యారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి డైరక్ట్‌గానే వార్నింగ్ ఇచ్చేశారు.

అయితే టోటల్‌గా టీడీపీలో అన్నితానై చూసుకుంటున్నారు. మరి ఇంతకు చినబాబు ఏమయ్యారనే డౌట్ అందరిలోనూ వస్తుంది. ఆ మధ్య నారా లోకేష్ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకున్నారు. నియోజకవర్గాల పర్యటనకు వెళ్లారు. కార్యకర్తలపై దాడులు జరిగినప్పుడు చినబాబు దూకుడుగా ముందుకెళ్లారు. వరుసపెట్టి జిల్లాల పర్యటనకు వెళ్లారు. చివరికి గుంటూరులో రమ్యశ్రీ హత్య జరిగిన సమయంలో చినబాబు కనిపించారు. అప్పుడు చినబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంకా అంతే మళ్ళీ చినబాబు బయట కనిపించడం లేదు. కేవలం సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితవుతున్నారు. అయితే చినబాబుని ఎందుకు బయటకు రానివ్వడం లేదు. కావాలనే ఆపారా? లేక వెనుక ఏమన్నా ప్లాన్ ఉందా? అని టీడీపీ శ్రేణులకు డౌట్ వస్తుంది. అయితే చినబాబు బయట తిరగడం వల్ల..ఆయనే టీడీపీకి సీఎం అభ్యర్ధి అని చెప్పి వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. దీని వల్ల టీడీపీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అందుకే చినబాబుని లోపల పెట్టి బాబు బయటకొచ్చారనే ప్రచారం జరుగుతుంది.

ఇదే సమయంలో టీడీపీ శ్రేణుల నుంచి మరో సమాధానం వస్తుంది. త్వరలోనే చినబాబు పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పాదయాత్రకు చినబాబు రెడీ అయ్యారని, అందుకే ఇప్పుడు బయటకు రావడం లేదని అంటున్నారు. పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయని తమ్ముళ్ళు అంటున్నారు. చూడాలి మరి చినబాబు బయటకు ఎప్పుడు వస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: