బలంగా ఉన్న అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రతిపక్ష టీడీపీ నానా రకాలుగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి అధికారంలోకి రాకపోతే పార్టీ భవిష్యత్‌కే కష్టమనే విషయం అధినేత చంద్రబాబుకు బాగా అర్ధమవుతుంది. నెక్స్ట్ గాని జగన్‌ని గద్దె దించకపోతే ఇంకా చంద్రబాబు రాజకీయ జీవితం కూడా దాదాపు క్లోజ్ అయ్యే పరిస్తితికి వస్తుంది. అందుకే వైసీపీకి ఎలాగైనా చెక్ పెట్టడానిక్ చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీని నిలువరించడానికి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. సాధారణంగా వైసీపీకి ఉన్న ప్రధాన బలం రెడ్డి వర్గం నేతలు. రెడ్డి నేతలే వైసీపీకి ప్రాణవాయువు లాంటి వారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వైసీపీ బలంగా ఉండటానికి కారణం వారే...అలాగే ప్రకాశం, నెల్లూరు లాంటి జిల్లాల్లో కూడా వైసీపీ సత్తా చాటాడానికి రెడ్డి నేతలే కారణం.

అంటే రెడ్డి నేతలకు చెక్ పెడితే వైసీపీని నిలువరించినట్లు అవుతుంది...అందుకే బాబు, రెడ్డి నేతల టార్గెట్‌గా వ్యూహాలు పన్నుతూ ముందుకెళుతున్నారు. అయితే రెడ్డి నేతలకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఇంకా చెప్పాలంటే జగన్ సొంత జిల్లా కడపలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలని నిలువరించడం జరిగే పని కాదు. ఒకవేళ కడపలో రెడ్డి ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోయినా సరే వారు...జగన్ ఇమేజ్‌తో నెగ్గుకొచ్చేగలరు.

జిల్లాలో 10 సీట్లు ఉంటే 7 సీట్లలో రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎలాగో పులివెందులలో జగన్ ఉన్న విషయం తెలిసిందే. ఇక రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి, జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి, రాజంపేటలో మేడా మల్లిఖార్జున్ రెడ్డి, ప్రొద్దుటూరులో శివప్రసాద్ రెడ్డి, కమలాపురంలో రవీంద్రా రెడ్డి, మైదుకూరులో రఘురామి రెడ్డిలు ఉన్నారు. ఈ రెడ్డి ఎమ్మెల్యేలంతా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అయినా సరే వారిని జగన్ ఇమేజ్ లాక్కొచ్చేస్తుంది. మొత్తానికైతే కడపలో రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యం కాదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: