దేశ‌వ్యాప్తంగా ఓవైపు క‌రోనా, మ‌రొక వైపు ఒమిక్రాన్ ప్ర‌జ‌ల వెంట ప‌డి పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఈ త‌రుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థ‌ల సెల‌వుల‌ను జ‌న‌వ‌రి 30 వ‌ర‌కు పొడిగించారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగింపు విష‌యంలో ఓ క్లారిటీని ఇచ్చింది ప్ర‌భుత్వం. తాజాగా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగించే అవ‌కాశమే లేదు అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేసారు.

ఏపీలోని గుంటూరు జిల్లా కాకుమానులో ఉన్న‌టువంటి జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మానికి విద్యాశాఖ మంత్రి హాజ‌రై.. సెల‌వుల పొడిగింపు విష‌యంలో ఎలాంటి మార్పు లేదు అని, రేప‌టి నుంచి ఏపీలో య‌ధావిధిగా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు తెరుచుకుంటాయ‌ని చెప్పారు. ఏపీ ప్ర‌భుత్వం విద్యార్థుల ఆరోగ్య భ‌ద్ర‌త‌తో పాటు భ‌విష్య‌త్ గురించి కూడా ఆలోచ‌న చేస్తుంద‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే ఉపాధ్యాయుల‌కు వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసామ‌ని, 15 సంవ‌త్స‌రాల నుంచి 18 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు విద్యార్థులంద‌రికీ దాదాపు 92 శాతం వాక్సిన్ చేసిన‌ట్టు వెల్ల‌డించారు మంత్రి.

రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల భ‌విష్య‌త్ దృష్టిలో పెట్టుకుని పాఠ‌శాల‌ల‌ను సంక్రాంతి సెల‌వులు ముగిసిన త‌రువాత జ‌న‌వ‌రి 17 నుంచి య‌ధావిధిగా న‌డిపించాల‌ని ఆలోచిస్తూనే.. వారి ఆరోగ్య భ‌ద్ర‌త‌పై కూడా డేగ క‌న్నుతో నిఘా ఉంచ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా నిబంధ‌న‌లు అనుస‌రిస్తూ.. పాఠ‌శాల‌ల‌ను న‌డిపించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో త‌ల్లిదండ్రులు ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి వెల్ల‌డించారు.

 ముఖ్యంగా ఇప్ప‌టివ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు ఎటువంటి సెల‌వులు మాత్రం ప్ర‌క‌టించే ఆలోచ‌న లేద‌ని.. భ‌విష్య‌త్‌లో అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి.. కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి అప్ప‌టిక‌ప్పుడూ ఏదైనా ఎమ‌ర్జెన్సీ నిర్ణ‌యం తీసుకునేందుకు ఆలోచ‌న చేస్తామ‌ని చెప్పారు.  మ‌రొక‌వైపు తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న రిత్యా రేప‌టి నుంచి జ‌న‌వ‌రి 30 వ‌ర‌కు సెల‌వుల‌ను ప్ర‌భుత్వం పొడిగించిన‌ట్టు నిర్ణ‌యం తీసుకున్న‌ది. సీఎం సోమేష్‌కుమార్ ఉత్వ‌ర్వుల‌ను కూడా జారీ చేసారు. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తుంది.  ఏపీలో  క‌రోనా కేసులు పెరిగితే ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నేది వేచి చూడాలి మ‌రీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: