యూపీ అసెంబ్లీ యుద్ధానికి సమరభేరి మోగింది. నోటిఫికేషన్ రావడంతో పార్టీలు పోరాటానికి సిద్ధం అయ్యాయి. గతంలో ఎన్నో సార్లు బహుముఖ పోరు జరిగిన యూపీలో ఈసారి మాత్రం ద్విముఖ పోరు జరిగేలా కనిపిస్తోంది. అది సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపితో ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ ఢీ కొట్టనున్నట్లు తాజా పరిణామాలతో ద్వారా స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగి పై ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో అఖిలేష్ యాదవ్ చూపిస్తున్న దూకుడు బీఎస్పీ అధినేత్రి మాయావతి మౌనం ఈసారి ఈ ఎన్నికల్లోప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఏడు దశల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి చావో రేవో అన్నట్లుగా మారిపోయాయి.

ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ పోరులో తప్పకుండా గెలిచి తీరాల్సిన ఒత్తిడంతా బీజేపీ పైనే ఉంది. యోగి సర్కార్ పై ఉన్న వ్యతిరేకత,లఖింపూర్ కేరి వంటి ఘటనలు, ధరల నియంత్రణ తో కేంద్రం వైఫల్యాలు అన్ని కలగలిసి ఇప్పుడు బీజేపీకి అక్కడ చుక్కలు చూపిస్తున్నాయి. సరిగ్గా ఇదే అంశాన్ని క్యాష్ చేసుకుంటూ సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వేస్తున్న అడుగులు సీఎం యోగి తో పాటు బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు. వీరిద్దరి మధ్య పోరులోకి చొరబడేందుకు కాంగ్రెస్, బీఎస్పీ వంటి పార్టీలు కూడా చేస్తున్న ప్రయత్నాలకు పట్టు చిక్కడం లేదు. దీంతో యూపీ  రాజకీయం ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా మారిపోయింది. యూపీఐ ఎలక్షన్స్ లో యోగి సర్కార్ వైఫల్యాలపై అఖిలేష్ మొదలుపెట్టిన పోరు మిగతా విపక్షాలకు అందనంత దూరంలో ఉంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్,సమాజ్వాది పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారు. మరికొందరు బీజేపీకి కూడా జై కొడుతున్నారు.

దీంతో మాయావతి దళిత ఓటు బ్యాంకు కాస్త మూడు పార్టీల మధ్య చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలితే మాత్రం వీరంతా గంపగుత్తగా అఖిలేష్ కు అండగా నిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన అంబేద్కర్ వాదులు, బీసీ ల ఓట్లనే టార్గెట్ చేస్తున్నారు. మరి మాయ మౌనం అఖిలేష్ కి కలిసివస్తుందా? బిజెపి మరో సారి సత్తా చాటుతుందా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: