మరి టీడీపీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయో తెలియదు లేక కావాలని వైసీపీ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తున్నాయో తెలియదు గాని..2019 ఎన్నికలైన దగ్గర నుంచి చంద్రబాబు కుప్పం వదిలేస్తున్నారు...నారా లోకేష్ మళ్ళీ మంగళగిరిలో పోటీ చేయరు...ఇంకా బాలయ్య హిందూపురం బరిలో దిగడం కష్టమే అంటూ ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇందులో నిజనిజాలు తెలియకపోయినా గత రెండున్నర ఏళ్లుగా ఇదే ప్రచారం వస్తుంది.

ఎప్పుడైతే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారో అప్పటి నుంచి సీన్ మారిపోయింది...ఆయన ఇక మంగళగిరిలో పోటీ చేయరని, చంద్రబాబు నియోజకవర్గం కుప్పం బరిలో దిగుతారని కథనాలు వచ్చాయి. అదే సమయంలో చంద్రబాబు కృష్ణా జిల్లా లేదా విశాఖపట్నంలలో ఏదొక సీటులో పోటీ చేస్తారని విశ్లేషకులు ప్రచారం చేశారు. పైగా ఆ మధ్య స్థానిక ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో ఇంకా కుప్పంలో చంద్రబాబు పోటీ చేయరని, ఆయన కుప్పం వదిలేసి వెళ్లిపోతారని వైసీపీ నేతలే విమర్శలు చేశారు.

సరే చంద్రబాబు, చినబాబుల సీట్ల విషయంలో సరిగ్గా క్లారిటీ లేదు అనుకుంటే..తాజాగా బాలయ్య సీటు విషయంలో సరికొత్త ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. అసలు హిందూపురంలో బాలయ్యకు వచ్చిన నష్టమేమీ లేదు. అయినా సరే బాలయ్య హిందూపురం వదిలేస్తున్నారని, గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టడానికి వస్తున్నారని తెలుగు తమ్ముళ్లే ప్రచారం చేసే పరిస్తితి. బాలయ్య డైరక్ట్ గుడివాడ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది.

ఇలా ముగ్గురు సీట్ల విషయంలో ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ వాస్తవ పరిస్తితులు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీలో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ముగ్గురు సీట్లలో ఎటువంటి మార్పు ఉండదని తెలిసింది. అసలు ఎవరు సీటు మారదని...చంద్రబాబు.. కుప్పంలో, చినబాబు..మంగళగిరిలో, బాలయ్య బాబు...హిందూపురం బరిలో ఉంటారని, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. కాబట్టి టీడీపీ శ్రేణులు కన్ఫ్యూజ్ అవ్వకూడదని అధిష్టానం నుంచి సమాచారం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: