వైసీపీ-రఘురామకృష్ణంరాజుల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఈ వార్‌కు ఇప్పటిలో ఫుల్‌స్టాప్ పడేలా లేదు.. రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ..వైసీపీకి ఎలాగైనా డ్యామేజ్ చేయాలని రఘురామ గట్టిగానే ట్రై చేస్తున్నారు. అసలు గత రెండు ఏళ్లుగా ఈ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అసలు రఘురామ మీడియా సమావేశం పెట్టడం..జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేస్తున్నారు...అటు వైసీపీకి ఏమో రఘురామ చేసే విమర్శలు ఏ మాత్రం నచ్చడం లేదు...అసలు తమ పార్టీ నుంచి గెలిచిన తమ ప్రభుత్వాన్నే విమర్శించడం ఏంటని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫైర్ అయిపోతున్నారు.

ఇటు వైసీపీ అధిష్టానం కూడా రఘురామకు చెక్ పెట్టాలని పలు రకాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కానీ రఘురామకు చెక్ పెట్టడం కుదరడం లేదు. అలాగే ఒకసారి ఆయన్ని అరెస్ట్ చేయించారు...మళ్ళీ అరెస్ట్ చేయించడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో రఘురామ...ఏపీ సి‌ఐడిీ పోలీసులపై డైరక్ట్‌గా కేంద్రానికే ఫిర్యాదు చేసేశారు. ఇలా వైసీపీ-రఘురామ యుద్ధం కొనసాగుతుంది. ఇదే క్రమంలో రఘురామ వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు, ఎంపీ పదవికి రాజీనామా చేసి, మళ్ళీ నరసాపురం బరిలో దిగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే నరసాపురం బరిలో వైసీపీకి చెక్ పెట్టి తన సత్తా ఏంటో చూపించాలని రఘురామ భావిస్తున్నారు..అసలు వైసీపీని ఓడించేస్తాననే ధీమా రఘురామకు ఉంది. ఆ ధీమా ఉండటానికి కారణం టీడీపీనే అని చెప్పొచ్చు. బీజేపీ-జనసేన అభ్యర్ధిగా రంగంలోకి దిగి...టీడీపీ మద్ధతు తీసుకుంటే గెలుపు ఈజీ అని రఘురామ భావిస్తున్నారు..వాస్తవ పరిస్తితులు చూస్తే టీడీపీ సపోర్ట్ ఇస్తే రఘురామ గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది...ఒకవేళ రఘురామ బీజేపీలో చేరి, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే మద్ధతు ఇవ్వకూడదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఒకవేళ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తేనే మద్ధతు ఇవ్వాలని... లేదంటే లేదని...తమ్ముళ్ళు క్లారిటీగా చెప్పేస్తున్నారు. మరి రఘురామ విషయంలో చంద్రబాబు ఎలా ముందుకెళ్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: