పండగకు బంధువులతో సరదాగా ఉన్న ప్రజలు కొందరూ పార్టీ మూడ్ లోకి వెళతారు. అందులో భాగంగా మద్యం సేవిస్తున్నారు.. దాంతో తెలుగు రాష్ట్రాలలొ మందుబాబులు ఉరకలు వేస్తూ తాగుతూ న్నారు. అదే వ్యాపారులకు కక్కుర్తి పుట్టింది. దాంతో మరింత సంపాదించాలని మద్యం ను కల్తీ చేసి అమ్ముథున్నారు. ఈ మేరకు అవి కొన్న మందుబాబులకు ఆరోగ్య పరిస్థితి క్షీణించడం తో పాటుగా చనిపోయిన దాఖలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. పండగ పూట ఇది విషాధ చాయలను అలుముకొని లా చేసింది. 12 మంది మృతి తో జనాలు షాక్ లో ఉన్నారు.


వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన నార్త్ ఇండియాలో వెలుగులోకి వచ్చింది. బీహార్ లో వెలుగు చూసింది.బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. సంక్రాంత్రి పండుగ వేడుకల్లో కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 12 మంది మృత్యు ఒడిలోకి చేరుకున్నారు.. ఇది నిజంగా భాధాకరం అని చెప్పాలి. కేవలం శని , ఆది వారాలలో  కేసులు భారీ ఎత్తున పెరిగాయి. 12 మంది ఒకేసారి చనిపొయారు. ఈ ఘటన తో విషాధ చాయలు అలుముకున్నాయి. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కల్తీ మద్యం అమ్మకాలు జరగడం అందరిని ఆలోచన లో పడేసినట్లు తెలుస్తుంది.


శుక్రవారం రాత్రి నలంద సమీపంలోని చోటిపహరి, పహరితల్లి ప్రాంతాల్లో మద్యం తాగిన కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు.. అప్పుడు 8 మంది చనిపొయారు. ఇక ఆదివారం కూడా 4 చనిపొయారు. ఒకవైపు మద్యం అమ్మకాలను ప్రభుత్వం రద్దు చేసినా ఎరులై పారుథుంది.నియంత్రించడంలో విఫలమైన స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. 2016 నుంచి భీహార్ లో మద్యం నిషేధం ఉంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలీ అంటూ భాధిత కుటుంబ సభ్యులు వాపొయారు. చాలా మంది పరిస్థితి విషమంగా మారింది. దీని పై ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసు కుంటారు..అనేది ఆసక్తిగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: