ప్రస్థుతం నందమూరి బాలకృష్ణ హవా మాటలకు అందని విధంగా ఉంది. బాలయ్య పని అయిపోయింది అంటూ సెటైర్లు వేసిన వారికి తనదైన రీతిలో గట్టి సమాధానం ఇస్తున్నాడు. క్రితంనెల విడుదలైన ‘అఖండ’ సూపర్ హిట్ కొట్టడం ఒక సంచలనం అయితే ఎవరు ఊహించని విధంగా బాలయ్య హోస్ట్ చేసిన ‘అన్ ష్టాపబుల్’ సక్సస్ అందరి మైండ్స్ బ్లాంక్ అయ్యేట్లు చేస్తోంది.


‘అఖండ’ సంచలన విజయం బాలయ్యకు కొత్త జోష్ ను ఇచ్చింది. ఈసినిమాలో మాస్ యాక్షన్ కి దైవబలాన్ని కూడా జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు.  ఇక ఈసినిమా కోసం తమన్ స్వరపరిచిన ‘జై బాలయ్య’ సాంగ్ జనంలోకి ఒక రేంజ్ లో దూసుకు పోవడంతో ఆపాట  ప్రస్తుతం  ట్రెండింగ్ గా  మారింది.‘జై బాలయ్య’ అనేపదం బాలకృష్ణ అభిమానుల స్లోగన్ ఆ స్లోగన్ పాటలో కలవడంతో ఆపాట సగటు సినిమా అభిమానులకు కూడ  బాగా  నచ్చింది. ఇప్పుడు ఈమ్యానియాను మరింత కొనసాగించడానికి బాలకృష్ణ  లేటెస్ట్  సినిమాకి అదే టైటిల్ ను సెట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో  ఉన్న సంగతి తెలిసిందే.


రాయలసీమ నేపథ్యంలో ‘వేటపాలెం’ లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈకథ ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఈసినిమాకు ‘జై బాలయ్య’  అన్న టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలువస్తున్నాయి. దీనికి స్పూర్తి చిరంజీవి అంటున్నారు. చిరంజీవి హీరోగా 1997లో ‘మాస్టర్’ అనే  సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ‘బాగున్నారా బాగున్నారా  బావగారూ బాగున్నారా' అనే పాట సూపర్ హిట్ అయింది. జనంలోకి బాగా వెళ్లిన ఆ పాటలోని  ‘బావగారూ బాగున్నారా’ అనే టైటిల్ తో  సినిమా తీసిబ్లాక్  బస్టర్  హిట్ కొట్టారు. ఇప్పుడు  ‘అఖండ’ సినిమాలోని పాపులర్ పాట ‘జై బాలయ్య’ పాటను గోపీచంద్ మలినేని మూవీకి టైటిల్ గా మారుతోంది అంటున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: