తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశం కనీసం తినడానికి తిండి లేక చేసేందుకు ఎలాంటి పని లేక  చాలామంది ప్రజలు ఆకలితో ఔగోలిస్తున్నారు. చివరికి కనీసం పిల్లల కడుపు అయిన నింపడానికి తల్లిదండ్రులు తమ శరీర భాగాలను కూడా అమ్ముకుంటున్నారు అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా తయారయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతటి దారుణ పరిస్థితి ఎక్కడ ఏర్పడిందో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఎక్కడో కాదు తాలిబన్లు ఏలుతున్న ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడే హెరాత్ ప్రావిన్స్లోని ఈ దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇటీవల అక్కడ కిడ్నీ అమ్మకాలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అలా ఒక కిడ్నీ అమ్ముకున్న టువంటి వ్యక్తి హజ్రత్ మాట్లాడుతూ నేను బయటకి వెళ్లి డబ్బులు అడుక్కోలేను అందుకోసమే ఆస్పత్రికి వెళ్లి మరి నా కిడ్నీని అరవై తొమ్మిది లక్షల రూపాయలకు అమ్మేశాను. కనీసం ఆ డబ్బుతో అయినా నా యొక్క పిల్లలకు కొంతకాలమైన తిండి పెట్టె కలుగుతానని ఆయన చెప్పారు. ఈ తరహాలోనే దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ప్రావిన్స్లో గత కొన్ని నెలలుగా కిడ్నీల విక్రయాలు కూడా చాలా పెరిగిపోయాయి. ఆర్థికంగా ఏర్పడినటువంటి సంక్షోభంతో చాలామంది కిడ్నీలు అమ్మడానికి ముందుకు వస్తున్నారని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని కిడ్నీ దాత మరియు కొనుగోలు గారు పరస్పర అంగీకారంతోనే ఇలా జరుగుతోందని వైద్యులు తెలియజేస్తున్నారు. కిడ్నీని కోల్పోవడం వలన తర్వాత తలెత్తే సమస్యల కన్నా వారి యొక్క కుటుంబ పోషణకే ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని  డాక్టర్లు చెబుతున్నారు. వారు కిడ్నీ ఇచ్చాక కనీసం సంవత్సరకాలం పాటు విశ్రాంతి అవసరమని సూచిస్తున్న ఎవరు కూడా లెక్క చేయడం లేదని, రెండు నెలల్లోనే దొరికిన పనికి వెళ్లిపోతున్నారని అంటున్నారు. చాలామంది ఇప్పటికే ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిపోయారని వారిలో కొంతమందిని ఆయా దేశాలు అడ్డుకొని మళ్లీ తిరిగి వెనక్కి పంపాలని స్థానికంగా ఉన్నటువంటి మతపెద్దలు తెలియజేశారు. కొంతమంది దేశం విడిచి వెళ్లే ముందు అక్కడ వారు చేసిన అప్పులు తీర్చుకోవడానికి వారి కిడ్నీలు అమ్ముకుంటున్నారు అని కూడా వివరించారు.

 ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి సునామీ రానున్నదని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమంలో గురువారం రోజున ఆందోళన వ్యక్తం చేసినది. ప్రపంచంలోని దేశాలన్నీ రాజకీయ వైరుధ్యాలు అన్నిటినీ పక్కన పెట్టేసి వెంటనే మానవతా దృక్పథంతో సాయం అందించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో 2.79 కోట్ల మందికి చాలా తీవ్రమైన ఆహారం కొరత ఏర్పడిందని, ఇందులో దాదాపుగా 87 లక్షల మంది ఆకలితో చావులకు దగ్గరకు వచ్చారని తెలియజేసింది. అయితే ఈ కొరత తీర్చడానికి వచ్చేటువంటి 12 నెలల పాటు మానవతా దృక్పథంతో సాయం  చేయాలని, దీని కోసం కనీసం 4.4 బిలియన్ డాలర్లు అవసరం అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: