అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కోవిడ్‌ పరిస్థితుల పై సీఎం వైయస్‌ . జగన్‌ మోహన్ రెడ్డి  సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను సీఎం వైయస్‌ . జగన్‌ మోహన్ రెడ్డి కు వివరించారు వైద్య శాఖ అధికారులు.  ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు  ఈ సందర్భంగా సిద్ధంగా  ఉన్నామన్నారు  వైద్య శాఖ అధికారులు.  అన్ని జిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు..  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో దాదాపు 27 వేల యాక్టివ్‌ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారని  సీఎం వైయస్‌ . జగన్‌ మోహన్ రెడ్డి  వివరించారు వైద్య శాఖ అధికారులు.  వీరిలో ఆక్సిజన్‌ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనన్న అధికారులు.. సుమారు 28వేల బెడ్లను సిద్ధం చేశామని స్పష్టం చేశారు వైద్య శాఖ అధికారులు. 

రెండో డోస్‌ వ్యాక్సి నేషన్‌ లో మిగతా జిల్లాలతో పోలిస్తే  దిగువన ఉన్న ఐదు జిల్లాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు  సీఎం వైయస్‌ . జగన్‌ మోహన్ రెడ్డి.  తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు  సీఎం వైయస్‌ . జగన్‌ మోహన్ రెడ్డి.  15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు... మరో 5 జిల్లాల్లో 90 శాతానికి పైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు  సీఎం వైయస్‌ . జగన్‌ మోహన్ రెడ్డి.  మరో నాలుగు జిల్లాల్లో 80 శాతానికి పైగా వ్యాక్సినేషన్‌ అయిందని... మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు  సీఎం వైయస్‌ . జగన్‌ మోహన్ రెడ్డి. కోవిడ్‌ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైనా సమావేశంలో చర్చ నిర్వహించారు  సీఎం వైయస్‌ . జగన్‌ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: