అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిఎం జగన్ మోహన్ రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు ఝలక్ ఇచ్చారు.   తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిఎం జగన్ మోహన్ రెడ్డి కి ఆర్టీసీ ఉద్యోగులు బహిరంగ  లేఖ విడుదల చేశారు.  ప్రభుత్వం లో ఆర్టీసీ సంస్థను  విలీనం వల్ల ఆర్టీసీ ఉద్యోగులు 2021 లో ఒక పీఆర్సీని కోల్పోయామని లేఖలో పేర్కొన్నారు ఆర్టీసీ ఉద్యోగులు.  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల కోల్పోయిన పీఆర్సీ  నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఉద్యోగులు.   ఆర్టీసీలో 2017 ఏప్రిల్ లో జరగాల్సిన పీఆర్సీకి  2019 ఫిబ్రవరి లో 25శాతం తాత్కాలిక ఫిట్ మెంట్ ఇచ్చారని వెల్లడించారు ఆర్టీసీ ఉద్యోగులు.   ప్రభుత్వ ఉద్యోగులకు 2018 లో ఎంత ఫిట్ మెంట్ ఇస్తే ఆర్టీసీ ఉద్యోగులకు అంత ఇస్తామని ఒప్పందం జరిగిందనని లేఖలో పేర్కొన్నారు ఆర్టీసీ ఉద్యోగులు.  

 ఆర్టీసీ ఉద్యోగులకు అదనపు  ఫిట్ మెంట్ బెనిఫిట్ ఇచ్చి స్కేల్స్ ఫిక్షేషన్ చేయాలని కోరుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ ఉద్యోగులు.   లేని పక్షంలో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు ఆర్టీసీ ఉద్యోగులు.   ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు ఒక్కోటిగా తీసేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆర్టీసీ ఉద్యోగులు.   SRBS, SBT, గ్రాడ్యుటీ, HRA లో సీలింగ్ లు అమలు సహా కొన్ని అలవెన్సులు రద్దు చేశారని ప్రభుత్వం పై మండిపడ్డారు ఆర్టీసీ ఉద్యోగులు.   ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న వైద్య సౌకర్యాలు తొలగించి, నెలసరి ఇన్సెంటివ్ లు కూడా నిలుపుదల చేశారన్నారు ఆర్టీసీ ఉద్యోగులు.  ఉద్యోగులకు దశాబ్దాలుగా ఇస్తున్న పండుగ అడ్వాన్సులనూ ఆపేశారని తెలిపారు ఆర్టీసీ ఉద్యోగులు.  2021 పీఆర్సీ నష్టపోతున్నందున చొరవ తీసుకుని న్యాయం చేయాలని సీఎంను కోరారు ఆర్టీసీ ఉద్యోగులు.   50 వేల ఆర్టీసీ ఉద్యోగులు, 40 వేల పెన్షనర్లకు న్యాయం చేయాలని సీఎం ను కోరారు ఆర్టీసీ ఉద్యోగులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: