ఇవాంకా వ‌స్తేనే హైద్రాబాద్ రోడ్లు బాగుప‌డ‌తాయి అని ఓ జోక్ ఆ మ‌ధ్య తెగ వైర‌ల్ అయింది.అవును ఇవాంకా న‌డ‌వ‌ని చూడ‌ని ర‌హ‌దారులు ఎలా ఉన్నా కూడా ప‌ట్టింపులో లేకుండా పోయాయి మ‌న పాల‌కుల‌కు! అన్న‌ది ఓ నిర్వేదం.ఇదే వాస్త‌వం కూడా! ఈ ద‌శలో హైద్రాబాద్ లో రోడ్ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వాటి నిర్వ‌హ‌ణ లోపంపై ఎప్ప‌టిక‌ప్పుడు అనేక ఉదంతాలు మ‌రియు ఉదాహ‌ర‌ణ‌లు వెలుగులోకి వ‌చ్చినా  ప‌ట్టించుకునేంత శ్ర‌ద్ధ, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేంత ఓపిక స్థానిక నాయ‌క‌త్వాల‌కు లేవ‌న్న‌ది ఓ విచార‌క‌ర విష‌యం.ఇదే సంద‌ర్భంలో మ‌న హైద్రాబాద్ రోడ్ల‌పై ఇ వ‌న్ ఫార్ములా రేసులు నిర్వ‌హిస్తామ‌ని మంత్రి కేటీఆర్ చెప్ప‌డం బాగుంది కానీ వివిధ కాల‌నీల్లో,శివారు ప్రాంతాల‌లో మురుగు నీటి వ్య‌వ‌స్థ ఎలా ఉంది? ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ ఎలా ఉంది ? అన్న‌వి కూడా దృష్టి పెట్టి, సంబంధిత మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌డితే మేలు. చేస్తారా? కేటీఆర్....


రోడ్లు సంగ‌తి ఎప్పుడయినా త‌లుచుకుంటే అటు ఆంధ్రా అయినా ఇటు తెలంగాణ అయినా ఒకేవిధంగా ఉన్నాయి. న‌గ‌రాల్లో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ర‌హ‌దారులు మిన‌హా మిగ‌తా ప్రాంతాల‌లో రోడ్ల నిర్వ‌హ‌ణ అన్న‌ది అస్త‌వ్య‌స్తంగా ఉన్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు. చిన్న‌చిన్న క‌చ్చా రోడ్లను కూడా బాగుచేసేందుకు ప్ర‌భుత్వాలు ముందుకు రావ‌డంలో సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు.ఇక గ్రామీణ ప్రాంత ర‌హ‌దారులు గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఈ ద‌శ‌లో మ‌నం రోడ్ల బాగు కోసం మాట్లాడుకోవాలా లేదా ఇ వ‌న్ ఫార్ములా రేసుల గురించి మాట్లాడుకుని సంబ‌ర‌పడిపోవాలా?ఇ - వ‌న్ ఫార్ములా రేసుకు సిద్ధం అవుతోంది భాగ్య‌న‌గ‌రి.ఇందుకు సంబంధించి ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తార‌క రామారావు.ఈ మేర‌కు సంబంధిత వ‌ర్గాల‌తో ఒప్పందాలు కూడా చేసుకున్నామ‌ని చెబుతున్నారు.ఇదంతా బాగుంది.హైద్రాబాద్ రోడ్ల‌పై ఇ వ‌న్ ఫార్ములా రేసులు నిర్వ‌హించ‌డం,విశ్వ‌న‌గ‌రి విఖ్యాతిని ఇంకొంత ఇనుమ‌డింజేయ‌డం బాగుంది.. కానీ మ‌హా న‌గరంలో ఇప్ప‌టికీ స‌రైన దారులు లేని ప్రాంతాలెన్నో. కాల‌నీలెన్నో. చిన్న పాటి వ‌ర్షానికే చెరువుల‌ను త‌ల‌పించేలా జ‌ల‌మ‌యం అయ్యే ప్రాంతాలెన్నో! వీటిన్నింటిపై దృష్టి సారించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr