పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్ధిని పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించబోతున్నారు. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి రావటం ఖాయమని ప్రీ పోల్ సర్వేలన్నింటిలోను తేలిపోయింది. క్షేత్రస్ధాయిలో కూడా మిగిలిన పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. అన్నీ పార్టీలు దాదాపు అంత:కలహాలతో గొడవలు పడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆప్ అధికారంలోకి వస్తే తమ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఎవరుండాలని కోరుకుంటున్నారో చెప్పాలంటే కేజ్రీవాల్ జనాలనే అడిగారు.
జనాలు తమ అభప్రాయాలను చెప్పటానికి 78740 78740 మొబైల్ నెంబర్ ను కూడా ప్రకటించారు. మొబైల్ నెంబర్ ప్రకటించిన 96 గంటల్లో 19 లక్షలమంది  తమ అభిప్రాయాలను చెప్పారు. వీరిలో 6.5 లక్షల మంది వాట్సప్ ద్వారా, 2.25 లక్షల మంది వాయిస్ మెసేజ్, 8 లక్షల మంది వాయిస్ కాల్ ద్వారా అభిప్రాయాన్ని పంచుకున్నారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేజ్రీవాలే మంగళవారం ప్రకటించబోతున్నారు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పంజాబ్ ఆప్ చీఫ్, ఎంపీ భగవంత్ సింగ్ మాన్ పేరునే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎక్కువమంది సూచించారని సమాచారం.
మాన్ ప్రస్తుతుం సంగ్రూర్ లోక్ సభ స్ధానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిపై లక్ష ఓట్ల మెజారిటితో గెలిచారు. అంతకుముందు అంటే 2014లో ఎస్ఏడీ అభ్యర్ధిపై లక్షన్నర ఓట్ల మెజారిటితో గెలిచారు. పార్టీ తరపున మొత్తం రాష్ట్రమంతా పర్యటిస్తు గట్టి పునాదులేశారు. అలాగే ప్రస్తుత అసెబ్లీలో ఆప్ 20 మంది ఎంఎల్ఏలతో మంచి ప్రతిపక్షంగా నిలవటానికి కూడా మాన్ చాలా కష్టపడ్డారట. పంజాబ్ జనాభాలో ముఖ్యంగా యువతలో పార్టీకి మంచి క్రేజ్ రావటానికి మాన్ విధానాలే కారణమని తెలుస్తోంది.

ఇన్ని ప్లస్ పాయింట్లున్నాయి కాబట్టే జనాలు కూడా మాన్ అభ్యర్ధిత్వంవైపే మొగ్గు చూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎలాగు కేజ్రీవాల్ గుడ్ లుక్స్ లో మాన్ ఉన్నారు. ప్రస్తుత ఎంఎల్ఏల్లో కూడా మాన్ అంటే అభ్యంతరాలు లేవు. కాబట్టి పరిస్ధితులు అనుకూలిస్తే ఆప్ తరపున కాబోయే పంజాబ్ ముఖ్యమంత్రిగా 99 శాతం భగవంత్ సిగ్ మానే ఖాయమంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: