ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రజలందరూ భయం గుప్పిట్లో కి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రెండు దశల కరోనా వైరస్ ను ఎదుర్కొన్న జనాలు ఇక ఇప్పుడు మూడవ దశ కూడా ముంచుకొస్తుండటంతో దేవుడా ఇక మిమ్మల్ని కరోనా వైరస్ వదిలిపెట్టదా అంటూ వేడుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కరోనా వైరస్ సమయంలో ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ నిరంతరాయంగా పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్స్ లో అటు పోలీసులు కూడా ఉన్నారు అని చెప్పాలి.



 ఎక్కడ కరోనా వైరస్ ప్రాణాలు తీస్తుందో అని అందరూ భయపడి ఇంటిపట్టునే ఉంటే.. అటు పోలీసులు మాత్రం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యోగం చేశారు. ఇక ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. అయితే ఎక్కువ మంది పై పంజా విసరకుండా పోలీసులు అవగాహన కల్పిస్తూ  వ్యాప్తికి అడ్డుపడుతున్నారు అనుకుందో ఏమో కరోనా వైరస్ పోలీసులను టార్గెట్ చేసింది. దీంతో గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఎంతో మంది పోలీసులు వైరస్ బారిన పడుతూ ఉండటం గమనార్హం.



 హైదరాబాద్ సిసిఎస్, సైబర్ క్రైమ్ విభాగాల్లో 20 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. ఇక నార్సింగి పోలీస్ స్టేషన్ లో మరో 20 మంది కూడా వైరస్ బారిన పడటం గమనార్హం. ఇక జిల్లాలోనూ పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు  వైరస్ బారిన పడుతుండటం తో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అని అందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు. ఎందుకంటే వైరస్ బారినపడి పోలీసులు విధులకు దూరమైతే పరిస్థితులు అదుపు తప్పుతాయి అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: