జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రాజ్యసభ ఎంపీ ఆఫర్ ను చిరంజీవి కాదన్నారు అనే వార్త మూడు రోజుల క్రితం పెద్ద హల్ చల్ చేసింది. దీనిపై అసలు రాజ్యసభ ఎంపీ ఆఫర్ ఇచ్చారా ? లేదా అనే విషయంపైనే రెండు, మూడు రోజులు పెద్ద డిబేటే జరిగింది. తనకు ఎవరు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని స్వయంగా చిరంజీవే చెప్పినా ఈ డిబేట్లు ఆగలేదు. వైసీపీ నుండి కూడా చిరంజీవికి రాజ్యసభ ఎంపి ఆఫర్ ఎవరు ఇవ్వలేదని క్లారిఫికేషన్ వచ్చినా ఎవరు నమ్మలేదు.




నిప్పులేనిదే పొగ రాదుకదా అనే సామెతలోలాగ మూడు రోజుల పాటు హోలు స్టేట్ రాజకీయమంతా చిరంజీవి చుట్టూయే తిరిగింది. చిరంజీవి కేంద్రంగా ఎల్లోమీడియా చేసిన రచ్చ రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్ళ బాధేమిటంటే జగన్ కు మెగాస్టార్ ఎక్కడ దగ్గరైపోతోడో ? ఎక్కడ వైసీపీ మనిషైపోతాడో అని. సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే చిరంజీవికి రాజ్యసభ ఎంపీ ఆఫర్ వచ్చింది నిజమే అని అమరావతి వర్గాలు ధృవీకరించాయి.




అయితే ఆ ఆఫర్ పై చిరంజీవి ఏమీ మాట్లాడకుండా దాటవేశారట. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా పోలేకేనట. జగన్ అంటే అభిమానం ఉన్నా పవన్ కు వ్యతిరేకంగా నడుచుకోవటం ఇష్టంలేకే చిరంజీవి ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఒకవేళ చిరంజీవి గనుక రాజ్యసభ ఎంపీ ఆఫర్ అంగీకరిస్తే వెంటనే వైసీపీ మనిషైపోతారు. రేపటి ఎన్నికల్లో వైసీపీ నేతగా ప్రత్యర్ధిపార్టీలపై మాట్లాడాల్సొస్తుంది.




స్వతహాగానే చిరంజీవి సౌమ్యుడు. ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు కూడా ప్రత్యర్ధులపై ఎప్పుడూ నోరుపారేసుకన్న వ్యక్తికాదు. కానీ ఇప్పటి రాజకీయాలు అలాగ లేవు. కాబట్టి ప్రత్యర్ధులు తనను ఎన్నంటే అందుకు రెట్టింపు అంటేనే జనాల్లో గుర్తింపు అనే రాజకీయం నడుస్తోంది. గట్టిగా చెప్పాలంటే రాజకీయాలకు చిరంజీవి ఏమాత్రం సెట్ అవ్వలేరు. పైగా తమ్ముడు పవన్ గురించి మాట్లాడాల్సొచ్చినపుడు మరింత ఇబ్బంది పడటం ఖాయం. ఒకసారి మాట్లాడటం మొదలుపెడితే అది ఎక్కడికి దారితీస్తుందో తెలీదు. అందుకనే ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకుని ముందుగానే రాజ్యసభ ఎంపీ ఆఫర్ ను పక్కన పెట్టేసినట్లు అమరావతి వర్గాలు చెప్పాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: