తెలంగాణ బలం పెంచుకోవడానికి బీజేపీ తెగ కష్టపడుతుందని చెప్పొచ్చు...తొలిసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు...ఎలాగైనా టీఆర్ఎస్‌ని గద్దె దించి అధికారం దక్కించుకోవాలని కమలదళం ముందుకెళుతుంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు దూకుడుగా వెళుతున్నారు...రాష్ట్ర నేతలకు కేంద్ర బీజేపీ పెద్దలు సైతం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదు.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ రేంజ్‌లో కేసీఆర్‌పై ఫైట్ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అయితే కేసీఆర్‌పై పోరాటం చేయడం బండికి పెద్ద కష్టమైన పని కావొచ్చు...కానీ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంగా విమర్శలు చేయడం సులువే..కానీ రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం కష్టమైన పని. ఇప్పుడు ఆ కష్టమైన పనిని బండి..తన భుజాలపైకి ఎత్తుకున్నారు.

అసలు తెలంగాణలో బీజేపీ బలపడటం అనేది అంత ఈజీ కాదు...ఎందుకంటే మొదట నుంచి ఇక్కడ బీజేపీకి బలం లేదు..క్షేత్ర స్థాయిలో బీజేపీకి క్యాడర్ లేదు...టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లకు ఉన్నట్లు స్థానికంగా బలమైన నాయకత్వం లేదు. ఏదో ఉపఎన్నికల్లో బలమైన నాయకుల వల్ల గెలిచేసింది గాని, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో సత్తా చాటడం బీజేపీకి సాధ్యం కాదు. నెక్స్ట్ గాని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. బూత్ స్థాయి నుంచి కార్యకర్తల బలం ఉండాలి. ఇప్పుడు ఆ బలం పెంచుకునే పనిలోనే బండి ఉన్నారు.

ఇదే క్రమంలో అసలు బీజేపీకి ఏ మాత్రం బలం లేని ఎస్సీ స్థానాలపై బండి ఫోకస్ పెట్టారు. అసలు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ స్థానాల్లో పార్టీకి ఏ మాత్రం పట్టు లేదు. ఇప్పుడు ఆ పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 19 ఎస్సీ స్థానాల్లో పార్టీ పికప్ అయ్యేలా చేయడానికి చూస్తున్నారు. అయితే ఆ స్థానాల్లో బీజేపీ బలపడటం అంత ఈజీ కాదు..కాబట్టి ఈ టాస్క్‌లో బండి సక్సెస్ అవ్వడం కూడా కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp