దేశంలో త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు అంద‌రి దృష్టి ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల్లో భాగంగా ఉత్త‌ర‌ప్రదేశ్ మీద ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే.. దేశంలోనే ఏ ఎన్నిక‌లు వ‌చ్చిన అధిక స్థానాలు ఉన్న‌ది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే. దేశ ప్ర‌ధానిని గెలిపించాల‌న్నా.. ఓడించాల‌న్నా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఫ‌లితాల‌ను బ‌ట్టి తేల‌నుంది. 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌లు స‌ర్వే సంస్థ‌లు, మీడియా సంస్థ‌లు అభిప్రాయాల‌ను సేక‌రించాయి.

 కేవ‌లం డీబీ లైవ్ మాత్ర‌మే బీజేపీకి 144 నుంచి 152 సీట్లు వ‌స్తాయి అని ఓ అంచెనా వేసింది. కానీ అన్ని ప్ర‌ధాన ఏజెన్సీలు బీజేపీకి 200 కంటే ఎక్కువ సీట్లే వ‌స్తాయని అంచెనా వేసింది. పోల్ ఆఫ్ పోల్స్‌లో కూడా బీజేపీకి 221 నుంచి 231 వ‌ర‌కు సీట్లు వ‌స్తాయ‌ని తేలిన‌ది. స‌మాజ్ వాదీ పార్టీ రాష్ట్రంలో రెండ‌వ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించ‌నున్న‌ద‌ని స‌ర్వేల‌న్నీ పేర్కొంటున్నాయి. మాయావ‌తి సారథ్యంలో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మూడు, నాలుగు స్థానాల‌లో ఉండ‌నున్నాయి.  

తొలుత పోల్ ఆప్ పోల్స్ గురించి చ‌ర్చించిన‌ట్ట‌యితే యూపీలో అధికార బీజేపీకి 221 నుంచి 231 సీట్ల వ‌ర‌కు వ‌స్తాయ‌నేది ఓ అంచ‌నా. ఇది క‌నుక‌ నిజ‌మైతే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో 403 అసెంబ్లీ స్థానాల‌లో బీజేపీకి పూర్తి మెజారిటీ ల‌భించిన‌ట్టే. అదే స‌మ‌యంలో స‌మాజ్‌వాది పార్టీకి 147 నుంచి 157 సీట్లు వ‌స్తాయ‌ని అంచెనా. ఇక పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం.. స‌మాజ్ వాదీ పార్టీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రెండ‌వ అతిపెద్ద‌ పార్టీగా అవ‌త‌రించ‌నున్న‌ది. మాయావ‌తి సారథ్యంలోని బీఎస్పీకి 7 నుంచి 13 సీట్లు కాంగ్రెస్‌కు 5 నుంచి 9 సీట్లు రావ‌చ్చు అని అంచెనా. పోల్ ఆఫ్ పోల్స్ ఫ‌లితాల ప్ర‌కారం.. 2022 యూపీ లో బీఎస్పీ, కాంగ్రెస్‌లు మూడు, నాలుగు స్థానాల‌లో నిలుస్తాయ‌ని అంచ‌నా..!

సీ ఓట‌ర్ స‌ర్వే ప్ర‌కారం..


సీ ఓట‌ర్ స‌ర్వే ప్ర‌కారం.. బీజేపీకి 223 నుండి 235 వ‌ర‌కు సీట్లు వ‌స్తాయ‌ని.. అదే స‌మ‌యంలో ఎస్పీకి 145నుంచి 157 వ‌ర‌కు సీట్లు వ‌చ్చే అవ‌కాశ‌మున్న‌ది. కాంగ్రెస్‌, బీఎస్పీల‌కు 3 నుంచి 7, 8 నుంచి 16 సీట్లొస్తాయ‌ని పేర్కొన్న‌ది.

ఇండియా టీవీ ప్ర‌కారం..

 
బీజేపీకి 230 నుండి 235 వ‌ర‌కు సీట్లు.. ఎస్పీకి 160 నుంచి 165 సీట్లు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తుంది. బీఎస్పీకి 1 నుంచి 5 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 7 సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది.

రిపబ్లిక్ అభిప్రాయ సేకరణ ప్ర‌కారం..


రిప‌బ్లిక్ పీ మార్క్ స‌ర్వే ప్ర‌కారం.. బీజేపీకి 252 నుండి 272 వ‌ర‌కు వ‌స్తాయ‌ని అంచెనా వేసింది. ఈ స‌ర్వేలో ఎస్పీకి 111 నుంచి 131 సీట్లు వ‌స్తాయి అని తేలిన‌ది. ఈ స‌మ‌యంలో బీఎస్పీకి 8 నుంచి 16 సీట్లు.. కాంగ్రెస్‌కు 3 నుంచి 9 సీట్లు రావ‌చ్చు అని వెల్ల‌డించింది.

డీబీ లైవ్ స‌ర్వే ప్ర‌కారం..

 
డీబీ లైవ్ స‌ర్వేలో ఎస్పీకి 203 నుంచి 211 సీట్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అదే స‌మ‌యంలో బీజేపీకి కేవ‌లం 144 నుంచి 152 సీట్ల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి రావ‌చ్చు అని తెలిపింది. బీఎస్పీకి 12 నుంచి 20 సీట్లు.. కాంగ్రెస్‌కు 19 నుంచి 27 సీట్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

టైమ్స్ నౌ వీటో ప్ర‌కారం..

బీజేపీకి 240 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. అదేవిధంగా ఎస్పీకి 143, బీఎస్పీకి 10, కాంగ్రెస్‌కు 8 సీట్లు వ‌స్తాయ‌ని ఓ అంచ‌నా వేసింది.

పోల్ స్ట్రాట్ న్యూస్ ఎక్స్ స‌ర్వే ..

పోల్ స్ట్రాట్ న్యూస్ ఎక్స్ స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం.. బీజేపీకి 235 నుంచి 245 సీట్లు, ఎస్పీకి 120 నుంచి 130  సీట్లు వ‌స్తాయి. అదేస‌మ‌యంలో బీఎస్పీకి 13 నుండి 16 సీట్లు, కాంగ్రెస్ కు 4 నుండి 5 సీట్లు మాత్ర‌మే రావ‌చ్చ‌ని అంచ‌నా.

ఇండియా న్యూస్ జ‌న్ కీ బాత్ ఓపినియ‌ల్ ప్ర‌కారం..

బీజేపీకి 226 నుంచి 246 సీట్లు, ఎస్పీకి 144 నుంచి 160, బీఎస్పీకి 8 నుంచి 12 సీట్లు.. కాంగ్రెస్ 0 నుంచి 1 వ‌ర‌కు సీట్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ఓ అంచెనా వేసింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఒక్కొక్క‌రి స‌ర్వే ఒక్కొక్క విధంగా ఉన్న‌ది. చివ‌రికీ ఎవ‌రి స‌ర్వే ఫ‌లితాలు నిజ‌మ‌వుతాయో తెలియాలంటే మార్చి 10 వ‌ర‌కు వేచి చూడాల్సిందే..!

 


మరింత సమాచారం తెలుసుకోండి: