వైసీపీ తరపున గెలిచిన ఎంపీయే అయినా.. ఇప్పుడు ఆ పార్టీ నేతలకు, రఘురామ కృష్ణంరాజుకి అస్సలు పడటంలేదు. ఆయన రాజీనామా చేసి మరీ పోటీ చేస్తానని ప్రకటించారు కూడా. అయితే రఘురామను గతంలో బలంగా టార్గెట్ చేసిన నేతలంతా.. ఇప్పుడాయన వ్యవహారాన్ని పూర్తిగా పక్కనపెట్టారు. ఆయన కోర్టు కేసులు, కామెంట్లు.. ఇతరత్రా విమర్శలను పూర్తిగా పట్టించుకోవడంలేదు. రఘురామని కామెంట్ చేసి ఆయన్ను హైలెట్ చేయడం ఎందుకనే ఉద్దేశంలో సైలెంట్ గా ఉన్నారు.

కానీ విజయసాయిరెడ్డి మాత్రం రఘురామ కృష్ణంరాజుపై మరోసారి సెటైర్ పేల్చారు. ఆరడుగులున్నా కూడా అన్నీ మరుగుజ్జు ఆలోచనలే అంటూ ట్వీట్ చేశారు. ప్రజలు తనని స్ఫూర్తిగా తీసుకుని పోరాటం చేయాలంటూ గతంలో రఘురామ ఇచ్చిన స్టేట్ మెంట్ ని కూడా కోట్ చేశారు విజయసాయిరెడ్డి. ఎన్నుకున్న వారిని వదిలేసి ఢిల్లీలో కూర్చున్నారని, ఆయనలో ఉన్న పోరాట స్ఫూర్తి ఏంటని ప్రశ్నించారు. బ్యాంక్ లను వేల కోట్లకు ముంచి విలాసాలు వెలగబెడుతున్నారంటూ సెటైర్లు పేల్చారు. ఓట్లు వేసిన వారికి ముఖం చూపించలేని పిరికితనాన్ని ఆదర్శంగా తీసుకోవాలా రాజా? అంటూ ప్రశ్నించారు. చివర్లో ఆరడుగులున్నా కూడా అన్నీ మరుగుజ్జు ఆలోచనలే అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

కదిలించి మరీ..
రఘురామని కదిలించి మరీ ఆయనతో విజయసాయిరెడ్డి తిట్టించుకున్నట్టయింది. ఆరడుగులున్న తాను మరుగుజ్జు ఆలోచనలు చేస్తే.. మీలాగే మీ ఆలోచనలు కూడా మరుగుజ్జే అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు రఘురామ కృష్ణంరాజు. ఏ1, ఏ2 అంటూ.. మళ్లీ పాత పల్లవి అందుకున్నారు. ఇంటి బయటకు వచ్చేందుకు పరదాలు ఎవరు అడ్డుపెట్టుకున్నారంటూ ప్రశ్నించారు రఘురామకృష్ణంరాజు. నా కేసుల సంగతి నేను చూసుకుంటా, ముందు మీరు కోర్టుకి హాజరుకండి అని  బదులిచ్చారు.


 

ఆమధ్య ఏపీలో రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరూ హైలెట్ చేయడంలేదు. ఆయన రాజీనామా వ్యవహారాన్ని కూడా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఈ దశలో ఇప్పుడు రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఆయనపై సెటైర్లు వేశారు, తిరిగి తనపైనే సెటైర్లు వేసేలా చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: