ఇక మరో మూడు వారాల్లో దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం ఖాయమని తేలింది. ఈ మేరకు తాజా నివేదిక చాలా భయపెడుతోంది. కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో పలు రకాల రీసెర్చ్ లు కరోనా తీవ్రతను అంచనా వేస్తున్నాయి.ఇక ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దేశంలో క్రమంగా కరోనా మీటర్ జెట్ స్పీడుగా దూసుకెళుతోంది.ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు పెద్ద ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ట స్థాయికి చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనావేసింది. ఇప్పటికే కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది.నగరాల్లో మొదలైన కరోనా వైరస్ ఉధృతి ఇప్పుడు గ్రామాలకు కూడా పాకింది. అయితే ఈ తీవ్రత అనేది ఎక్కువ కాలం ఉండవచ్చని మరో మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట్ర స్థాయికి చేరుకోవచ్చన్నది ఎస్బీఐ అంచనా వేసింది.

దేశంలోనే ఎక్కువగా ముంబై నగరంలో ఈనెల 7న 20971 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ సీజన్ లో ఇదే గరిష్ట స్థాయి అని చెప్పాలి.. ముంబైలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరిన 2-3 వారాల్లో జాతీయ గరిష్టస్థాయి నమోదయ్యే అవకాశం కూడా ఉందని ఎస్బీఐ పేర్కొంది.ఇండియా లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం డిసెంబర్ 29వ తేదీ నుంచి మొదలైంది. ఇక ఆ తర్వాత నెల 17వ తేదీకి వచ్చేసరికి రోజువారీ కరోనా వైరస్ కేసుల సంఖ్య 2.38 లక్షలకు చేరింది. ఈ లెక్కన మూడు వారాల్లో కరోనా వైరస్ గరిష్టస్థాయిని తాకుతుందని అంచనా వేసింది ఎస్బీఐ.ఇక దేశంలో 64 శాతం ప్రజలకు ఇప్పటికే రెండో డోసుల వ్యాక్సినేషన్ ని పూర్తి చేశారు.అలాగే మరోవైపు ప్రజలు పెద్ద ఎత్తున కరోనా మహమ్మారి బారినపడగా..ఇక ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య మాత్రం బాగా తగ్గుతుంది. దీనికి వ్యాక్సినేషన్ కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: