రాజకీయంగా బలంగా ఉన్న నేతలకే జగన్ మంత్రి పదవులు ఇచ్చారని చెప్పొచ్చు. మొదట నుంచి తనకు అండగా ఉంటూ, వైసీపీ బలోపేతానికి కృషి చేస్తూ, అలాగే రాజకీయంగా తమ తమ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్‌గా ఉండే నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారు. అందుకే చాలామంది మంత్రులు మంచి పనితీరు కనబర్చకపోయినా సరే వారు రాజకీయంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అసలు వాస్తవానికి చెప్పుకుంటే జగన్ క్యాబినెట్‌లో ఎంతమంది మంత్రులు మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే పనితీరు పరంగా మాత్రం మంత్రులు స్ట్రాంగ్‌గా లేరని చెప్పొచ్చు.

కాకపోతే రాజకీయంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు...అలా స్ట్రాంగ్‌గా ఉన్నవారిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల మంత్రులు స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. రెండు జిల్లాల్లో నలుగురు మంత్రులు ఉన్నారు. ప్రకాశంలో బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్‌...నెల్లూరులో మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు. ఈ నలుగురు నేతలు రాజకీయంగా బలమైన వారు. ఇందులో బాలినేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒంగోలు అసెంబ్లీలో ఈయనని ఢీకొట్టడం అంత సులువు కాదు...ఒక 2014లో ఓటమి పాలయ్యారు గాని...మిగిలిన ఎన్నికల్లో సత్తా చాటారు. అసలు ఒంగోలు అసెంబ్లీ బాలినేని అడ్డా అని చెప్పొచ్చు. పైగా ఇప్పుడు మంత్రిగా ఉండటంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది.

అటు ఎర్రగొండపాలెంలో సురేష్‌కు తిరుగులేదు. ఎర్రగొండపాలెంలో టీడీపీకి పెద్ద బలం లేదు. ఇక్కడ వైసీపీ హవా కొనసాగుతూ వస్తుంది. పైగా ఇక్కడ టీడీపీలో లుకలుకలు ఉన్నాయి. దీంతో సురేష్‌కు ఎర్రగొండపాలెంలో తిరుగులేని పరిస్తితి ఉంది. అటు నెల్లూరు సిటీలో అనిల్ హవా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇటీవల నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలో వైసీపీ క్లీన్‌స్వీప్ అయ్యేలా చేశారు. ఇటు ఆత్మకూరులో గౌతం బలం ఏంటో చెప్పాల్సిన పని లేదు. అక్కడ గౌతంని ఓడించడం అంత ఈజీ కాదు. మొత్తానికైతే ఈ నలుగురు మంత్రులకు మళ్ళీ గెలిచే సత్తా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: