ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ఉత్తరప్రదేశ రాజకీయాలు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే ఒక్కసారిగా పుంజుకుంది. అదికూడా చిత్ర విచిత్రమైన రాజకీయాలతో ప్రధానపార్టీల్లో షాకుల మీద షాకులు తెప్పిస్తోంది. ఓ వారంరోజుల పాటు బీజేపీని ఇబ్బందులు పెట్టిన షాకులు ఇపుడు రివర్సులో ఎస్పీ అధినేతకే షాకులు కొడుతోంది. తమ పార్టీలో నుండి మంత్రులను, ఎంఎల్ఏలను ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ లాగేసుకుంటానంటే కమలనాదులు చూస్తు ఊరుకుంటారా ?




అందుకని ఏకంగా ములాయం ఇంట్లోనే చిచ్చుపెట్టేశారు. అఖిలేష్ మరదలు అంటే సవతి సోదరుడి బార్య అపర్ణయాదవ్ ను లాగేసుకుంది. ఆమె బీజేపీలో చేరిపోయారు. అంతటితో ఆగటం లేదు. ములాయం సింగ్ యాదవ్ రెండోభార్య సాధనగుప్తా తరపున వాళ్ళు అఖిలేష్ యాదవ్ పై తిరుగుబాటు చేసినట్లే ఉన్నారు. ఎందుకంటే అఖిలేష్ మీద మంటతో ఒక ప్యాకేజీ కుదుర్చుకుని ఎస్పీని వదిలేసి బీజేపీలో చేరిపోతున్నారు. అటు పెద్ద భార్య కొడుకు అఖిలేష్ కు చెప్పలేక, ఇటు రెండోభార్యకు ఆమె సంతానానికి, బావమరిదిని కంట్రోలో చేయలేక ములాయం చేతులెత్తేసినట్లే ఉన్నారు.




అందుకనే అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిపోయారు. ఆమెతో పాటు ఆమె మేనమామ అంటే తల్లి సోదరుడు ప్రమోద్ కుమార్ గుప్తా కూడా ఎస్పీకి బైబై చెప్పేసి కమలంపార్టీలో చేరుతున్నారు. మొదటినుండి సవతి తల్లి సాధన గుప్తా అంటే అఖిలేష్ కు ఏమాత్రం పడదు. కాకపోతే తండ్రి ములాయం యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి అఖిలేష్ ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే ములాయం డౌన్ అయిపోయారో అప్పటినుండే అఖిలేష్ సవతి తల్లి, ఆమె సంతానాన్ని అణిచివేత మొదలుపెట్టారు. సవతి తల్లితో పాటు ఆమె కొడుకు ప్రతీక్ యాదవ్ కు రాజకీయాల్లో ఆసక్తి ఉన్నా అఖిలేష్ తొక్కి పెట్టేశాడు.




ఒకసారి ప్రతీక్ యాదవ్ కు టికెట్ ఇచ్చినపుడు గెలిచినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా తనను దగ్గరకు రానీయద్దని ముఖ్యులందరికీ చెప్పాడు. ఒకపుడు ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ సోదరుడి మీద తిరుగుబాటు చేసి వేరే పార్టీ పెట్టుకున్నాడు. అప్పుడు సవతి తల్లితో పాటు ఆమె సంతానం శివపాల్ కు మద్దతుగా నిలిచారు. దాంతో అఖిలేష్ కు బాగా మండిది. అప్పటి నుండి సవతితల్లి సాధన, ఆమె కొడుకు ప్రతీక్, కోడలు అపర్ణా, సాధన సోదరుడు ప్రమోద్ గుప్తా అంటేనే అఖిలేష్ మండిపోతున్నాడు.




ఒకపుడు అపర్ణా, ప్రతీక్ పోటీచేసిన నియోజకవర్గాలు ఇపుడు బీజేపీ నుండి వచ్చిన వారికి కేటాయించేశాడు అఖిలేష్. అంటే అపర్ణాయాదవ్, ప్రతీక్ యాదవ్ కు పోటీచేయటానికి నియోజకవర్గాలు లేవు.  అందుకనే తాము పోటీచేయటానికి బీజేపీని కరెక్టు వేదికగా డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళంతా ఆలోచించుకుని ఒక్కసారిగా తిరుగుబాటు లేవదీశారు. మరీ తిరుగుబాటు ఎక్కడిదాకా తీసుకెళుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: