తెలంగాణలో మహిళా యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ఇటీవల కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకూ తెలంగాణలో మహిళల కోసం ప్రత్యేకంగా యూనివర్శిటీ అంటూ లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలోని  పద్మావతీ మహిళా యూనివర్శిటీయే ఉండేది.. విభజన తరవాత తెలంగాణకు అంటూ ప్రత్యేకంగా మహిళా వర్శిటీ లేకుండా పోయింది.


ఇప్పుడు కేసీఆర్ సర్కారు తెలంగాణ మహిళా వర్శిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగింది. ఇప్పటికే కోఠి మహిళా కళాశాలను మహిళా వర్సిటీగా మార్చాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కోఠి మహిళా కళాశాలను మహిళా వర్సిటీగా మార్చే అంశాన్ని సీరియస్‌ గా పరిశీలిస్తోంది. ఈ మేరకు అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు. బోధన, విద్యార్థులకు వసతులు, మౌలిక సౌకర్యాలపై చర్చించారు. కోఠి మహిళా కళాశాలకు త్వరలో వందేళ్లు పూర్తి కాబోతున్న సమయంలో దాన్ని మహిళా వర్సిటీగా మార్చడం నిజంగా అభినందనీయం.


కోఠి కళాశాలను తొలి మహిళా వర్సిటీగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి  సబిత అంటున్నారు. ఈ కళాశాలను వర్సిటీగా మార్చేందుకు అర్హతలు కలిగి ఉందంటున్న  సబితయయ సీఎం కేసీఆర్ ఆదేశాలతో వర్సిటీ ఏర్పాటు పనులు వేగవంతం చేస్తామంటున్నారు. దీనిపై ఇప్పటికే నివేదిక రూపొందించాలని మంత్రి సబిత ఆదేశాలు ఇచ్చారు. విధివిధానాలు, అనుమతుల వివరాలు వచ్చాక.. తగిన చర్యలు వేగంగా తీసుకోవాలని సబిత యోచిస్తున్నారు.


కోఠి విమెన్స్ కాలేజీని వర్సిటీ మారిస్తే.. కోర్సులు పెరుగుతాయి. విద్యార్థినుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మహిళా విద్యకు ఆ వర్శిటీ ఓ చిరునామాగా నిలచిపోతుంది. మహిళా విద్యను పోత్సహించే దిశగా ఇది ఓ గొప్ప ముందుడుగు అవుతుందని మహిళా విద్యావేత్తలు చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ మహిళా యూనివర్శిటీ కల సాకారం కావాలని ఆశిద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: