ప్రస్తుతం కరోనా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. భయం గుప్పిట్లోకి నెడుతుంది కరోన వైరస్. ఒక దశ  వైరస్ నుంచి కోలుకున్నామని  సంతోషపడి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే లోపే మరో దశ కరోన వైరస్ శరవేగంగా దూసుకు వస్తూ ప్రాణాలు తీయడానికి శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచం మొత్తం ఆందోళనలో మునిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మనిషి నుంచి మనిషికి ఎంతో సులభంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి కరోన వైరస్ అందరినీ బెంబేలెత్తిస్తోంది.



 వైరస్ వ్యాప్తి నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వస్తున్నారు. ఇంకొంతమంది వ్యాక్సిన్ వేసుకుని వైరస్ పై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కేవలం రెండు డోసుల వ్యాక్సిన్లు మాత్రమే కాదు బూస్టర్ డోసు కూడా వేసుకుంటూ వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటున్నారు. అయినప్పటికీ ఎంతో మంది వైరస్ బారిన పడుతూ ఉండటం గమనార్హం. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉండడం ఎంతో ఆందోళనకరంగానే మారిపోయింది.. అయితే ఇన్ని రోజుల వరకు మనుషుల నుండి మనుషులకు మాత్రమే వైరస్ వ్యాప్తి చెందేది. కానీ ఇప్పుడు మాత్రం మనుషుల నుంచి జంతువులకు కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది అన్నది తేలింది.


 ఇటీవలే దక్షిణాఫ్రికా లోని ఓ ప్రైవేటు జంతు ప్రదర్శన శాలలో మనుషుల నుంచి మూడు సింహాలకు కరోన వైరస్ సోకిన నిర్వాహకులు గుర్తించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మూడవ దశ విజృంభిస్తున్న సమయంలో ఇక సింహాలు కూడా కరోనా వైరస్ బారిన పడటం ఆందోళనకరంగా మారిపోయింది. గౌంటింగ్ రాష్ట్రంలోని ప్రైవేటు జూలో  లక్షణాలు బయట పడని వ్యక్తుల ద్వారా సింహాలకు వైరస్ సోకింది అనే విషయం తేలింది. ఇక వైరస్ బారిన పడిన సింహాలలో పొడి దగ్గు ఆయాసం ముక్కు కారడం వంటి లక్షణాలతో పదిహేను రోజుల పాటు  బాధ పడ్డాయి అంటూ అక్కడి జూన్ నిర్వాహకులు తెలిపారు. అయితే వైరస్ బారిన పడిన తర్వాత 7 వారాలకు కూడా ఆర్ టి పి సి ఆర్ పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని జూ నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు కరోన బారిన పడిన సింహాలు కోరుకుంటున్నాయి అంటూ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: