ఆంధ్ర ప్రదేశ్ లో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీకి ఇది గట్టి ఎదురు దెబ్బే. ఎందుకంటే.. ఆ పార్టీ సీనియర్ నేత, నిన్నమొన్నటి వరకూ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు గా పని చేసిన వ్యక్తి, మాజీ మంత్రి వర్యుడి కి  న్యాయస్థానం అక్షింతలు వేసింది.  కోటి రూపాయలు జరిమానా చెల్లించాలని అదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఎవరా నేత ? ఏమిటా కేసు ?
కన్నా లక్ష్మీ నారాయణ.. ఆంధ్ర ప్రదేేశ్ రాజకీయాలలో పరిచయం అవసరం లేని పేరు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతాపార్టీలో చేరిన వ్యక్తి. అనతి కాలంలోనే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేశారు. పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లు కోర్టు భావించింది. ఆయనతో పాటు ఆయన కుటంబ సభ్యుల పై గతంలో నమోదయిన  గృహ హంస కేసులో పరిహారం చెల్లించాలని న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి. కన్నా లక్ష్మీ నారాయణ ముద్దుల కుమారుడు నాగరాజు 2006 లో శ్రీ లక్ష్మీ కీర్తి అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారు ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కొంత కాలం తరువాత లక్ష్మి తనను అత్త మామలు విజయ లక్ష్మి, కన్నా లక్ష్మీనారాయణలు తరచుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. తనను చూసేందుకు పుట్టింటి వారు వచ్చినా చూసేందుకు అనుమతించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరచుగా కొడుతున్నారని, తనకు, తన కూతురికి  రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దీంతో పోలీసులు మాజీ మంత్రి పైన, అతని కుటుంబ సభ్యుల పైనా  గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ చేసిన న్యాయస్థానం బాధితురాలికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని  ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఆమె కు వసతి సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో నెలకు యాభై వేల రూపాయలు చెల్లించాలని తీర్పు నిచ్చింది. కుమార్తె వైద్యం కోసం శ్రీ లక్ష్మి వెచ్చించిన యాభై వేల రూపాయలను కూడా చెల్లించాలని సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: