ఏపిలో కరోనా కేసులు పెరుగుతూన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.. రోజు రోజుకు కేసులు భారీ సంఖ్యలో పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా మరో వైపు పెరుగుతూ వస్తున్నాయి.ఇది అందరికి ఆందోళన కలిగిసిస్తుంది.. అయితే  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే సంక్రాంతికి నైట్ కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయించారు. పండగ తర్వాత అమలు చేయాలనీ అనుకున్నారు. 



జనవరి 18 నుంచి నైట్ కర్ఫ్యూ ను అమలు చేయాలని ఆలోచనలొ అధికారులు ఉన్నట్ల సమాచారం. ఈ మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. నైట్ కర్ప్యూ నిబంధనల నుంచి ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్స్, ఫార్మసీ రంగం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, ఇంటర్నెట్ , ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్య సిబ్బంది తరహా మిగిలిన అన్నీ దాదాపు అన్నీ బంద్ అవుతూన్నాయని తెలుస్తుంది.

మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా బయటకు వెళితే మాత్రం భారీ ముల్యాన్ని చెల్లించుకొవాలి. ఇకపోతే పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటివాటికి గరిష్టంగా 2 వందలమంది, ఇన్‌డోర్ అయితే 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. 


అందరూ కోవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సినిమా హాళ్లు, రెస్టారెంట్ల లో భౌతిక దూరం పాటించాలి. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు మాస్కులు ధరించేలా చేయాలనీ అధికారులు కోరారు. పదివేల నుంచి 25 వేల వరకూ జరిమానా విధిస్తారు.. ఎక్కడైనా గుంపులుగా మాత్రం ఉండరాదని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వుండాలి.. లక్షణాలు కనిపిస్తే టెస్ట్ లు చేయించుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గతంలో కంటే ఇప్పుడు వస్తున్న కరొనా మాత్రం చాలా ప్రమాదకరంగ వుంది. ప్రజలు అప్రమత్తం గా వుండాలి

మరింత సమాచారం తెలుసుకోండి: