ఢిల్లీ :  గత శీతాకాల సమావేశాల్లో ( డిసెంబరు 2) రాజ్యసభ లో “ప్రత్యేక ప్రస్తావన” కింద “నదుల అనుసంధానం” అంశాన్ని లేవనెత్తారు బిజేపి పార్టీ  సభ్యుడు సి.ఎమ్ రమేశ్. లేఖ ద్వారా  “నదుల అనుసంధానం” ప్రాజెక్టుల అమలు తీరుతెన్నులను ఈ సందర్భంగా వివరించారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.  దేశంలో “నదుల అనుసంధానం” ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.   దేశంలో చేపట్టిన “నదుల అనుసంధానం” పథకంలోని   తొలి ప్రాజెక్టు ఆయన  “కెన్-బెట్వా” ( ఉత్తర్ ప్రదేశ్ , మధ్య ప్రదేశ్) అమలుకు సిద్దంగా ఉందని వెల్లడించారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.  “కెన్-బెత్వా” నదుల అనుసంధానం ప్రాజెక్టుకు  44, 605 కోట్ల రూపాయల వ్యయ అంచనాను రూపొందించగా, 39,317 కోట్ల రూపాయలను కేంద్రం ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.  

1980 లో “జాతీయ దృక్కోణం యోజన” ను  అప్పటి కేంద్ర సాగునీటి మంత్రిత్వ శాఖ రూపొందించిదని స్పష్టం చేశారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. మిగులు జలాలు ఉన్న ఒక నదీ ప్రాంతం ( బేసిన్) నుంచి జలాల కొరత ఉన్న మరో నదీ ప్రాంతం ( బేసిన్) కు జలాలను తరలించే కార్యక్రమం ద్వారా జలవనరులను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం అన్నారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.  “జాతీయ దృక్కోణం యోజన” న కింద “నదుల అనుసంధానం” ను దేశంలో  “సంప్రదింపులు”, బాగస్వామ్య రాష్ట్రాల సమ్మతితో ఏకాభిప్రాయం సాధించడం ద్వారా వివిధ ప్రాజెక్టులను అమలు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. దీనిపై ఏ రాష్ట్రం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.  

మరింత సమాచారం తెలుసుకోండి: