బ్రిటన్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏ రేంజిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోకుండా బయటికి వెళ్తే జరిమానాలు విధించడం లాంటివి కూడా చేస్తుంది. అంతే కాకుండా ప్రజలు ఎక్కడ గుమ్మ గూడ కుండా నిషేధాజ్ఞలు కూడా జారీ చేస్తూ ఉండటం గమనార్హం. ప్రపంచంలో మేమే నెంబర్ వన్ అని చెప్పుకునే బ్రిటన్కు ఇటీవలి కాలంలో కరోనా వైరస్ కారణంగా గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.


 ప్రతిరోజు  లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తుండడంతో ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఎక్కువ మందితో కూడిన శుభకార్యాలు పార్టీలు లాంటి వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ ఇటీవలే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యవహరించిన తీరు మాత్రం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా మారిపోయింది అంటూ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే బ్రిటన్లో ఉన్న పబ్బులు క్లబ్బుల పై నిషేధం విధించింది ప్రభుత్వం. అంతేకాదు శుభకార్యాలు వివిధ పార్టీలు కూడా నిర్వహించుకునేందుకు అవకాశం లేదు అంటూ తెలిపింది.


 ఇవన్నీ ఆంక్షలను విధించింది బ్రిటన్ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న బోరిస్ జాన్సన్. అయితే ఇటీవలే ఆయనే  స్వయంగా ఎంతో మంది అతిథులు మద్యం పార్టీ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఇక ఎంతమంది ప్రతిపక్షాలు  విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయంపై బోరిస్ జాన్సన్ స్పందించిన తీరు మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. కరోనా వైరస్ నిబంధనలు పాటించాలని తమ ప్రభుత్వం నిబంధనలు పెట్టిన మాట వాస్తవమే.. కానీ అందులో మందు పార్టీలు చేసుకోవద్దు అని రూల్ ఉందన్న విషయం మాత్రం నాకు తెలియదు అంటూ బోరిస్ జాన్సన్ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయనపై ఇంకా విమర్శలు ఎక్కువయ్యాయి. దేశ ప్రజలందరికీ నిబంధనలు పెట్టిన ఆయనకే వీటి గురించి తెలియక పోవడం అంటూ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: