మరికొన్ని రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుందా అంటే ప్రస్తుతం రష్యా వ్యవహరిస్తున్న తీరు చూస్తే మాత్రం ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచిఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతుంది . ఉక్రెయిన్ పై ఆధిపత్యాన్ని సాధించడమే లక్ష్యంగా రష్యా ఎన్నో కుట్రలు పన్నుతోంది. అదే సమయంలో ఉక్రెయిన్ కు మేము అండగా ఉన్నామంటూ అగ్ర దేశమైన అమెరికా ఈ వివాదంలో కలుగజేసుకోవటం తో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే ఉక్రెయిన్ పై ఆధిపత్యం నేపథ్యంలో మొదలైన వివాదం కాస్త అగ్రదేశాలు గా కొనసాగుతున్న రష్యా అమెరికా మధ్య యుద్ధం వరకూ దారితీసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు రష్యా మిత్రదేశాలు మరో వైపు నుంచి అమెరికా మిత్ర దేశాలు యుద్ధం చేస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అని అంటున్నారు. అయితే అటు రష్యా వేస్తున్న ప్రతి అడుగు కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగానే ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. మేము స్వతంత్ర దేశంగానే ఉంటాం మా జోలికి రావద్దు అంటూ ఉక్రెయిన్ రష్యనూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.



 అయితే ఇటీవల రష్యా మరింత తెగించినట్లు  తెలుస్తోంది.ఇప్పటికే ఏకంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి దూసుకుపోయి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది రష్యా. ఇక ఇప్పుడు తమ సైన్యాన్ని బేలూరస్ కి కూడా తరలించినట్లు తెలుస్తోంది.. ఇక రష్యా తమ సైన్యాన్ని బేలారస్ కి తరలించడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా ఊహకందని విధంగా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. రష్యా తెగింపు మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అయ్యేలా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: