గత చరిత్రను చూస్తే అందరికీ ఇదే అనుమానం వస్తుంది. జనసేనకు ఓపెన్ గా చంద్రబాబునాయుడు లవ్ ప్రపోజల్ పంపినా కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెస్పాండ్ కాకుండా ఉండటం వెనుక అనేక కారణాలున్నాయి. వీటిల్లో టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు ఎలాంటి లాభము ఉండదనే వాదన పార్టీలో పెరగటమే. ఒకళ్ళిద్దరేమో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలనంటున్నారు. మరికొందరేమో పొత్తు వద్దేవద్దంటున్నారు. అయితే పొత్తు పెట్టుకోవాలనే వారికన్నా వద్దని చెబుతున్న వారి సంఖ్యే ఎక్కువుందట.




ఇంతకీ వద్దంటున్న వారి వాదన ఏమిటంటే చంద్రబాబుది దృతరాష్ట్ర కౌగిలిగా ముద్రపడటం. దీనికి ఆధారాలు కావాలంటే చరిత్రను ఒకసారి తిరగేయాల్సిందే. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని బాగుపడిన పార్టీ కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నది వాస్తవం. ముందు లెఫ్ట్ పార్టీల సంగతే చూడండి. ఒకపుడు లెఫ్ట్ పార్టీలు కలిసున్నపుడు కొన్ని సీట్లయినా వచ్చేవి. ఎప్పుడైతే చంద్రబాబుతో పొత్తన్నాయో వెంటనే దెబ్బతినేశాయి. తర్వాత బీజేపీ పరిస్ధితి కూడా ఇంతే.




మూడుసార్లు బీజేపీ పొత్తు పెట్టుకున్నా పార్టీ బలపడిందేమీలేదు. కేంద్రస్ధాయిలో ఉన్న కీలక నేతల మద్దతు ద్వారా రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారనే ఆరోపణలు కమలంపార్టీలోనే ఉన్నాయి. ఈ కారణంగానే బీజేపీ రాష్ట్రంలో ఎందుకు పనికిరాకుండా పోయింది. అందుకనే ఇపుడు చంద్రబాబుతో పొత్తు వద్దేవద్దని సీట్లు వచ్చినా రాకపోయినా సొంతంగానే పోటీ చేద్దామని వాదించే కమలనాదులు ఎక్కువగా ఉన్నారు.




ఇలాంటి విషయాలే జనసేనలో ఇపుడు చర్చ జరుగుతోంది. సొంతంగా పోటీచేస్తే ఇపుడు కాకపోయినా రేపైనా పార్టీని జనాలు ఆదరిస్తారని బలమైన వర్గం వాదిస్తోంది. అలాకాదని చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటే అవసరం తీరిన తర్వాత జనసేనను దూరంగా తరిమేస్తారని కొందరు నేతలు చరిత్రను గుర్తుచేస్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే రెండుపార్టీలు లాభపడాలి. కానీ టీడీపీ మాత్రమే పొత్తులతో లాభపడి మిగిలిన పార్టీల దెబ్బతినేస్తున్నాయి. పైగా కొన్నిజిల్లాల్లో కమ్మ-కాపు మధ్య విభేదాలను గుర్తుచేస్తున్నారు. అనవసరంగా కాపులను జనసేనకు మనంతట మనమే దూరం చేసుకోవటం ఎందుకని వాదిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: