పీఆర్సీ, హెచ్ఆర్ఏ తదితర అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయటంలేదు. ఈనెల 25వ తేదీలోగా సవరించిన జీతాలు, విడుదల చేసిన ఏడీలతో కొత్త వేతనాల బిల్లులను పంపాలని ఆర్ధికశాఖ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి అందిన వేతనాల బిల్లులను ఒకసారి చూసుకుని 28వ తేదీకి ఆర్ధికశాఖ ట్రెజరీకి పంపుతుంది. అక్కడి నుండి జిల్లాల ట్రెజరీలకు చేరుకుని ఉద్యోగులకు వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి.




ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెడ్డెక్కారు. అలాగే ఉపాధ్యాయులు కూడా విధులను బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి లెక్కే చేయటంలేదు.  ఉద్యోగులందరికీ సవరించిన వేతనాలను ఇవ్వటానికే ప్రభుత్వం డిసైడ్ చేసింది. మరి ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. ప్రస్తుతం ఆందోళనలు మొదలుపెట్టిన ఉద్యోగులు 15 రోజుల తర్వాత నుండి నిరవధిక సమ్మెకు రెడీ అవుతున్నారు.




శుక్రవారం చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వటానికి ఉద్యగుల సంఘాల నేతల జేఏసీ డిసైడ్ చేసింది. సవరించిన వేతనాల జీవోలను, హెచ్ఆర్ఏ విధానాలను వాపసు తీసుకునేంతవరకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపేది లేదని ఉద్యోగనేతలు గట్టిగా అనుకున్నారు. దాంతో వివాదం బాగా పెరిగిపోతోంది.  మామూలుగా అయితే ఉద్యోగ నేతల వార్నింగులకు, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం దిగిరావాల్సిందే. కానీ జగన్ మాత్రం పెద్దగా పట్టించుకోవటంలేదు.




ఉద్యోగులతో పెట్టుకుంటే సమస్య వస్తుందని తర్వాత ఎన్నికల్లో గెలవటం కష్టమనే భావన ఉంది. అందుకనే ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగులతో ఘర్షణపడటానికి ఇష్టపడదు. చంద్రబాబునాయుడు కూడా ఉద్యోగనేతలు ఏమి చెబితే అది ఎలా చెబితే అలా చేసేవారు. అయినా ఘోరంగా ఓడిపోయారు. ఎందుకంటే ప్రజలే ఒళ్ళుమండి టీడీపీని ఘోరంగా ఓడించారు. అంటే ఉద్యోగులతో పెట్టుకుంటే అధికారపార్టి గెలవటం కష్టమనే భావన తప్పని మొన్నటి ఎన్నికలు నిరూపించాయి.




అందుకనే జగన్ ఉద్యోగుల ఆందోళనను పెద్దగా పట్టించుకోవటంలేదేమో. ఒకటికి పదిసార్లు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని ఉన్నతాధికారులు వివరించారు. తనతో భేటీ సందర్భంగా జగన్ కూడా అన్నీ విషయాలను వివరించారు. ముందు అన్నింటికీ ఒప్పుకుని ఇపుడు  హెచ్ఆర్ఏ తగ్గుతోందంటు ఉద్యోగులు గోల మొదలుపెట్టారు. ఇటు ప్రభుత్వం అటు ఉద్యోగుల నేతలు ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు చివరకు ఏమవుతుందో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: