కొడాలి నాని...ఈ పేరు వింటే చాలు తెలుగు తమ్ముళ్ళకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అసలు తమ పార్టీలో ఎదిగి, తమ నాయకుడునే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని తమ్ముళ్ళు రగిలిపోతూ ఉన్నారు. సరేలే తమ్ముళ్ళు బాధపడుతున్నారని కొడాలి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు...ఛాన్స్ దొరికిన ప్రతిసారి చంద్రబాబుని ఏకిపారేస్తున్నారు. ఇక నాని మాటలు ఎలా ఉంటాయో తమ్ముళ్ళకు బాగా తెలుసు.

ఇలా కొడాలి తిడుతుండటంతో తమ్ముళ్ళు లోలోపల ఫైర్ అయిపోతున్నారు. ఎందుకంటే పైకి ఫైర్ అయిన కొడాలిని ఏం చేయలేరు. పైగా కొడాలి అధికారంలో ఉన్నారు..మంత్రిగా ఉన్నారు. అయినా సరే తమ్ముళ్ళు పట్టు విడవడం లేదు. ఎలాగైనా నానికి చెక్ పెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆయనని గుడివాడలో ఓడిస్తానే తమకు మనశ్శాంతి అన్నట్లు తమ్ముళ్ళు రాజకీయం నడుపుతున్నారు. అందుకే తమ్ముళ్ళు కూడా ఏ అవకాశం దొరికిన వదలడం లేదు. గుడివాడ ప్రజల్లో కొడాలిపై నెగిటివ్ తీసుకురావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.


ఎలాగైనా గుడివాడలో నెగిటివ్ తీసుకొస్తే నానికి నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉండవని తమ్ముళ్ళు భావిస్తున్నారు. అయితే తమ్ముళ్ళ ఐడియా బాగానే ఉంది గాని..ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. నానిని నెగిటివ్ చేస్తే నానికే ఎఫెక్ట్ గాని, టీడీపీకి ఒరిగేది ఏమి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే గుడివాడలో టీడీపీ కూడా బలపడితేనే నానికి ఇబ్బంది...టీడీపీ బలపడకుండా నానిని ఏమి చేయలేరు.

కానీ అది వదిలేసి నానిని నెగిటివ్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే ఆయనపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా గుడివాడలో గోవా సంస్కృతి తీసుకొచ్చారని క్యాసినో లాంటివి ఆడిస్తున్నారని తమ్ముళ్ళు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. మరి ఈ ఆరోపణల్లో ఎంత నిజముందో తెలియదు గాని...ఇవన్నీ గుడివాడ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏది ఎలా జరిగినా గుడివాడలో మెజారిటీ ప్రజలు నానినే తమ లీడర్ అనుకుంటున్నారు. కాబట్టి తమ్ముళ్ళు ఎన్ని చేసిన గుడివాడలో వర్కౌట్ కావు.

మరింత సమాచారం తెలుసుకోండి: