ఏపిలో కరోనా మహమ్మరి కోరలు చాచుతుంది. గతంలో కన్నా ఇప్పుడు కేసులు మరింత పెరుగుతున్నాయి. తెలంగాణ తో పోలిస్తే ఎపి లో పాజిటివ్ కేసులు మరింత పెరిగాయి.. రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యం లో ఆరోగ్య శాఖా అధికారులు కూడా కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా వుండాలని అంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలో 3,557 కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ఆధారంగా 4,207 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు..


470 కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. కాగ నేడు 1,20,215 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు.అలాగే ఇద్దరూ మరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ఏపీ లో కూడా కేసులు అధికంగా పెరుగుతూన్నాయని తెలుస్తుంది..రోజుకు పది వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 12000 కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి తో పోలిస్తే నేడు కేసులు భారీగా పెరిగాయని తెలుస్తుంది.గడిచిన 24 గంటల లో కొత్తగా 12615 కరోనా కేసులు నమోదు అయ్యాయి.


ఇలా చూసుకుంటే ఎపిలొ మొత్తం కేసుల సంఖ్య మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2140056 కి పెరిగింది. కోవిడ్ వల్ల విశాఖపట్నం లో ముగ్గురు,చిత్తూరు మరియు నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన కేసుల సంఖ్య విషయాన్నికొస్తే..14527 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53871 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 3,674 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2071658 లక్షలకు చేరింది.. నాలుగు లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మూడు లక్షల మందికి లక్షణాలు వున్నట్లు తెలిసింది.. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకొవాలని అధికారులు కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: