దేశంలో ఇప్ప‌టికి ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. ఏవిధ‌మైన ఫ‌లితాలు రాబోతున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్ర‌భుత్వం ప‌నితీరు ఏవిధంగా ఉంది అంటూ స‌ర్వే నిర్వ‌హించింది ఓ సంస్థ‌. కాబోయే ప్ర‌ధాని ఎవ‌రైతే బెట‌ర్ అంటూ మ‌రొక అంశంపై కూడా స‌ర్వే చేప‌ట్టింది. మూడ్ ఆప్ ది నేష‌న్ 2022 పేరుతో జ‌రిగిన ఈ స‌ర్వేలో టాప్‌-4లో నిలిచిన న‌లుగురి పేర్ల‌ను వెల్ల‌డించింది. వారికి అనుకూలంగా ఎంతమంది ఉన్నార‌నే విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం.. భార‌త్‌కు ప్ర‌ధాని మ‌రొక‌సారి మోడీనే కావాల‌ని కోరుకుంటున్నారు.

ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్ల‌ను ప్ర‌స్తావించింది. మూడ్ ఆఫ్ ది నేష‌న్ 2022 స‌ర్వేలో 53 శాతం ప్ర‌జ‌లు త‌రువాత ప్ర‌ధాని మోడీ బెట‌ర్ అని అభిప్రాయ ప‌డ‌గా.. 7 శాతం మంది రాహుల్‌గాంధీకి, 6 శాతం మంది యోగి ఆదిత్య‌నాథ్‌కు, 4 శాతం అమిత్‌షాకు ఓటు వేసారు.

మ‌రొక వైపు ప్ర‌ధాని మోడీ గ్రాఫ్‌పై కూడా పెద్ద చ‌ర్చ‌నే కొన‌సాగుతుంది. ర్యాంకింగ్స్‌లో ప్ర‌ధాని  ఈ స్థానం వ‌చ్చింది. మోడీ గ్రాఫ్ ఎంత పెరిగింది. ఎంత ప‌డిపోయింద‌నే దానిపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఏ పాల‌న బెట‌రా..?  యూపీఏ  పాల‌న బెట‌రా అనే అంశాల‌పైకూడా స‌ర్వేలు సాగుతున్నాయి. తాజాగా ఇండియా టూడే మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వే వెల్ల‌డించిన‌ది.  ఈ స‌ర్వే ప్ర‌కారం.. ప్ర‌ధాని గ్రాఫ్ కాస్త పెరిగింఇ. ఆగ‌స్టు 2020లో 66 శాతం ఉన్న న‌రేంద్ర మోడీ గ్రాఫ్‌.. కోవిడ్ ఘోరంగా దెబ్బ‌కొట్టింది. 2021లో దిగ‌జారింది. 2021 ఆగ‌స్టులో 53 శాతానికి ప‌డిపోగా.. తాజాగా స‌ర్వే ఫ‌లితాల్లో ఎన్టీఏ ప‌నితీరుపై 59 శాతం మంది సంతృప్తి వ్య‌క్తం చేసారు. దీనితో ప్ర‌ధాని మోడీ గ్రాఫ్ పెరిగిన‌ట్టు అయింది.  ఆగ‌స్టు 2021న సంతృప్తి చెంద‌ని వారి సంఖ్య 17 శాతంగా ఉంటే.. జ‌న‌వ‌రి 2022 వ‌చ్చే స‌రికి ఆ సంఖ్య అనూహ్యంగా 26 శాతానికి దూసుకెళ్లిన‌ది. ఒక‌వైపు సంతృప్తి చెందిన వారి సంఖ్య పెర‌గ‌గా.. అదే స‌మ‌యంలో అసంతృప్తుల సంఖ్య  కూడా పెర‌గ‌డం ఆసక్తిక‌రంగా మారడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: