తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు మరోసారి ఇ పెంచేందుకు కేసీఆర్ సర్కార్ సన్నద్ధమవుతోంది. వ్యవసాయ మరియు వ్యవసాయ ఇతర ఆస్తుల మూల మార్కెట్ విలువలను సవరించి.. కొత్త మార్కెట్ విలువలను ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 శాతం అలాగే ఖాళీ స్థలాల విలువ 35 శాతం, అపార్ట్మెంట్ల విలువలను 25 శాతానికి పెంచాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు మరో ఐదు రోజుల్లోనే ఆర్డీవో ల ఆధ్వర్యంలోని కమిటీ లు కొత్త మార్కెట్ విలువలను ఫైనల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలను అమల్లోకి వచ్చేలా వారం రోజుల్లో.. తమ కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది రిజిస్ట్రేషన్ శాఖ. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సరాల తర్వాత..  అంటే 2021 సంవత్సరం లో వ్యవసాయ మరియు వ్యవసాయేతర కాసుల మార్కెట్ విలువ ల తో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ రూములను అమాంతం పెంచేసింది కేసీఆర్ సర్కార్. వ్యవసాయ మరియు వ్యవసాయ ఇతర ఆస్తుల మూల మార్కెట్ విలువలను దాదాపు 20 శాతం పెంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ప్రక్రియ జరిగి ఏడాది గడవకముందే మరోసారి ధరలు పెంచాలని ఆలోచనలో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపై రెండు రోజుల కిందట సమావేశమైన రిజిస్ట్రేషన్ శాఖ.. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఈజీ శేషాద్రి, సంయుక్త ఐజిలు జిల్లా రిజిస్టర్ లతో  సుదీర్ఘంగా సమావేశం నిర్వహించింది. ఒకటి రెండు రోజుల్లోనే ప్రతిపాదనను తుదిరూపు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మార్కెట్ విలువలను సవరించి కొత్త ధరలు అమలు చేసే దిశగా చర్యలు తీసుకొనున్నరు.

మరింత సమాచారం తెలుసుకోండి: