సీఎం పవన్..సీఎం పవన్ అని అరవడమే తప్ప...ఎప్పుడు పవన్‌ని సీఎం చేయాలనే దిశగా జనసేన నేతలు గాని, కార్యకర్తలు గాని పనిచేయలేదనే చెప్పాలి. ఏదో సభల్లో హడావిడి చేయడమే తప్ప..అసలు పార్టీని ఎలా బలోపేతం చేయాలనే ఆలోచన పెద్దగా చేసినట్లు కనబడలేదు. ఆర్ధిక పరంగా కూడా ఇబ్బందులు ఉండకూడదని చెప్పి పవన్ మళ్ళీ సినిమాలు తీస్తున్నారు. దీంతో రాజకీయాలకు అప్పుడప్పుడు మాత్రమే సమయం కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు జనసేన నేతలు లీడ్ తీసుకుని పార్టీని ముందుకు నడిపించాలి...కానీ వారు అలా చేయకుండా..ఏదో పవన్ రాష్ట్రానికి వచ్చి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మాత్రమే నేతలు, కార్యకర్తలు హడావిడి చేస్తున్నారు.

కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలు మాత్రం అలా కాదు...చంద్రబాబు రాష్ట్రంలో లేకపోయినా సరే...తమ తమ నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉంటూ వైసీపీపై పోరాటం చేస్తున్నారు. అటు టీడీపీ కార్యకర్తలు కూడా క్షేత్ర స్థాయిలో పోరాడుతున్నారు. వైసీపీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన నిలబడుతున్నారు. అలా నిలబడుతున్నారు కాబట్టి..2019లో పాతాళానికి వెళ్ళిన పార్టీ...ఇప్పుడు పైకి లేచింది.

ఈ పట్టుదల జనసేన నేతల్లో కనిపించడం లేదు. ఏదో మీడియా, సోషల్ మీడియాల్లో స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి తప్ప, పార్టీని బలోపేతం చేయడంలో ముందు ఉండటం లేదు. ఇటీవల కూడా పొత్తు విషయంలో జనసేన నేతలు ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడేశారు. కొందరేమో మాకు అన్ని సీట్లు కావాలి...ఇన్ని సీట్లు కావాలని, మరికొందరేమో పవన్‌కు సీఎం సీటు ఇస్తే, టీడీపీకి సపోర్ట్ ఇస్తామని అన్నారు.

అసలు పార్టీకి బలం లేకుండా సీఎం సీటు ఎలా అడుగుతున్నారనేది ఆశ్చర్యం కలిగించింది. పైగా కొందరు జనసేన నేతలు...జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయకుండా, సోషల్ మీడియాలో చంద్రబాబుపై విమర్శలు చేసే పనిలో ఉన్నారు. అసలు ప్రజల్లోకి వెళ్ళి నాలుగు ఓట్లు తీసుకురాలేని వాళ్ళు కూడా పోస్టులు వేసేస్తూ..జనసేనకు ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు. ఇక అలాంటి నేతల వల్ల పవన్‌కు రూపాయి ప్రయోజనం ఉండదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: