ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె చేస్తామని..  పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి  బొప్పరాజు పేర్కొన్నారు. ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించమని.. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను.. ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.  సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తామని.. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె జరుగుతుందన్నారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి  బొప్పరాజు.  ఈ నెల 24న నోటీసు ఇస్తామని... 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగనున్నాయని చెప్పారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేస్తామని ప్రకటన చేశారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి  బొప్పరాజు.  

26 న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాల సమర్పణ ఉంటుందని.. ఈ నెల 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు చేస్తామని ప్రకటన చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్య క్రమం జరి గిందని.. ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ ఉంటుందని స్పష్టం చేశారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి  బొప్పరాజు.  సంఘాలుగా మా మధ్య ఎలాంటి బేధాభి ప్రాయాలున్నా.. సాధారణ ఉద్యోగుల కోసం మేమంతా కలిశామన్నారు.  మంత్రుల కమిటీ ఏదో వేశామని ప్రభుత్వం  చెబుతోందని.. ప్రభుత్వం మొండిగా ఉందని ఫైర్‌ అయ్యారు బ. ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమించేలా పాల్గొనాలని... జీవోలను రద్దు చేయాలి.. లేదా అబెయన్సులో పెట్టాలి.. ఆ తర్వాతే చర్చ లకు వెళ్తామని స్పష్టం చేశారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి  బొప్పరాజు.  ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి  బొప్పరాజు.ప్రభుత్వం తమ పట్ల ఇలా వ్యవహరించడం అస్సలు బాగోలేదని..  ఇకనైనా వారి వైఖరి మార్చుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: