ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రచార సరళిని, పారిపాలనను పలువురు నేతలు ఫాలో అవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పాఠశాలల అభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి నాడు- నేడు కార్యక్రమం విజయవంతంగా చేపట్టాగా, దానిని తెలంగాణ ప్రభుత్వం మరో పేరుతో అమలు చేయనుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్  ఎన్నికల్లో మస్లిం నేత వై.ఎస్. జగన్ పరిపాలనను అనుసరిస్తానని చెప్పకనే చెప్పారు. ఆయన ఎవరో తెలుసా ?
హైదరాబాద్ లో పుట్టి  దేశవ్యాప్తంగా క్యాడర్ ను పెంచుకున్న ఎం.ఐ.ఎం పార్టీ ఉత్తరాదిన జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే. ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ లో హోరా హోరీ తలపడుతోంది.ఇందుకోసం చాలా కాలం నుంచే ఆ పార్టీ నేతలు  అక్కడే మకాం పెట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఎన్నికల వేళ ఆ పార్టీ పలు రాజకీయ పక్షాలతో పొత్తును కూడా పెట్టికుంది. ఎన్నికల యుద్దంలో తన సత్తా చాటేందుకు  అవసరమైన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో తొలి విడుత ప్రచారం పూర్తి చేసినట్లు రాజకీయ పరిశీలకులు పేర్కోంటున్నారు.
ఉత్తర ప్రదేశ్ లో తమ కూటమికి అధికారం పట్టబెడితే పరిపాలనలో పలు మార్పులు తీసుకు వస్తామని ఓవైసీ ప్రకటించారు. లక్నోలో ఆయన  విలేకరులతోను, పార్టీ నేతలతోను మాట్లాడుతూ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారం లోనికి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులుంటారని ప్రకటించి ప్రతిపక్షనేతలను విస్మయానికి గురి చేశారు,. అంతే కాకుండా ముగ్గురు డిప్యూటీ సిఎం లు ఉంటారని కూడా ఓవైసీ  ప్రకటించారు. భారత్ ముక్తి మోర్చా, బాబూ సింగ్ కుష్వాహా పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉన్నదని, నామినేషన్ల పూర్తయ్యే లోపు మరి కొన్ని పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటామని ఓవైసీ తెలిపారు. ఇద్దరు సి.ఎంలలో ఒకరు ఓబిసి కి చెందిన వారు కాగా, మరోకరు దళితులుంటారని తెలిపారు. ముగ్గురు డిప్యూటీ  సి.ఎంలలో ఒకరు ఖచ్చితంగా మైనార్టీకి చెందిన వ్యక్తి ఉంటారని ఓవైసీ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఐదుగురు  డిప్యూటీ సిఎంలు ఉన్న విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు రాజకీయ పరిశీలకులు పేర్కోంటున్నారు. దీనిని బట్టి చూస్తే చాలా కాలంగా  రాజకీయ మిత్రులుగా ఉన్న వై.ఎస్, జగన్ మోహన్ రెడ్డిని ఓవైసీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: