అబ్బే కొడాలి నానిని తెలుగు తమ్ముళ్ళు వదిలేలా లేరు...తమ అధినేత చంద్రబాబుని చెడామడా తిడుతున్న నానికి చెక్ పెట్టేవరకు తమ్ముళ్ళు నిద్రపోయేలా లేరు. ఎలాగైనా నానిని గుడివాడ బరిలో ఓడించాలనే కసితో తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. వరుసపెట్టి గుడివాడలో గెలుస్తూ సత్తా చాటుతున్న నాని విజయాలకు ఈ సారి ఎలాగైనా బ్రేకులు వేయాలని అనుకుంటున్నారు. అందుకే ఈ సారి మీడియాలో కాకుండా డైరక్ట్‌గా గుడివాడ బరిలోనే తేల్చుకోవడానికి తమ్ముళ్ళు రెడీ అయిపోయారు. ఇప్పటికే క్యాసినో వ్యవహారంపై గుడివాడలో తమ్ముళ్ళు రచ్చ చేసిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీ వాళ్లపై కొడాలి నాని అనుచరులు దాడులుకు దిగిన విషయం కూడా తెలిసిందే.
 
అంటే ఇప్పటికే క్యాసినో వ్యవహారంలో నానిని నెగిటివ్ చేయడానికి తమ్ముళ్ళు గట్టిగానే ప్రయత్నించారు. ఇక గుడివాడ వచ్చి వైసీపీ శ్రేణులని రెచ్చగొట్టి దాడులు చేసేవరకు తీసుకొచ్చారు. దీని ద్వారా సానుభూతి పొందాలని ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. సరే ఎవరెన్ని చేసిన గుడివాడలో తనని ఎవరు ఏమి చేయలేరని కొడాలి చెబుతున్న విషయం తెలిసిందే. కొడాలి మాటలు బట్టి చూస్తే...గుడివాడలో నానికి చెక్ పెట్టడం సాధ్యం కాదని అర్ధం.


అయితే అంత ధైర్యంగా కొడాలి చెప్పడానికి కారణాలు కూడా లేకపోలేదు. గుడివాడలో కొడాలికి అంటూ సెపరేట్ బలం ఉంది. ముఖ్యంగా కొడాలి బలం వచ్చి ఎస్సీ ఓటర్లు. వీరే మెయిన్. గుడివాడలో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు వన్‌సైడ్‌గా కొడాలి వైపే మొగ్గు చూపుతారు. అందుకే కొడాలికి వరుస పెట్టి విజయాలు వస్తున్నాయి. అసలు చెప్పాలంటే ఎస్సీ ఓటర్లే కొడాలికి బలం.

ఇప్పుడు ఆ బలంపైనే టీడీపీ గురిపెట్టినట్లు కనిపిస్తోంది. కొందరు ఎస్సీ టీడీపీ నేతల ద్వారా గుడివాడలో ఎస్సీ ఓటర్లని నానికి దూరం చేయాలని చూస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, ఎస్సీ నేత నక్కా ఆనందబాబు సైతం గుడివాడ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే మరికొందరు నేతలని గుడివాడ పంపి ఎస్సీ ఓటర్లని ఆకర్షించాలని టీడీపీ ప్లాన్ చేసింది. మరి చూడాలి టీడీపీ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: