
ఇక ఈ అద్భుతమైన ఆయుధాలకు ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేర్చటమే కాదు.. అదే సమయంలో ఆయుధ విక్రయాలను కూడా ప్రారంభించింది. ఇప్పటివరకు భారత రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసిన అద్భుతమైన ఆయుధాలలో బ్రహ్మోస్ క్షిపణి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎంతో అద్భుతమైన సామర్థ్యం కలిగిన బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వియత్నాం బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు చేసింది అనే విషయం తెలిసిందే. బడ్జెట్లో దాదాపు 27వేల కోట్ల రూపాయలు బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు కోసం కేటాయించింది వియత్నాం. ఇక ఇప్పుడు మరో రెండు దేశాలు బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఫిలిఫైన్స్ తోపాటు ఇండోనేషియా దేశాల్లో ప్రస్తుతం ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు చేసేందుకు భారీగా ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యాలు ఆయుధాలు అమ్మేందుకు మొండిచేయి చూపిస్తున్నా తరుణంలో ప్రస్తుతం ఎన్నో చిన్న దేశాలు భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తూ ఉండటం గమనార్హం. ఇలా క్రమక్రమంగా భారత్ ఆయుధ విక్రయాలలో దూసుకుపోతుందని ఇది ఒక రకంగా శుభపరిణామం అని అంటున్నారు విశ్లేషకులు. రానున్న రోజులు మరిన్ని చిన్న దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.