ధూళిపాళ్ళ నరేంద్ర...ఈ పేరు గురించి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు. దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేస్తూ వస్తున్న ధూళిపాళ్ళ అంటే రాష్ట్ర స్థాయిలో జనాలకు తెలిసిన నాయకుడు. అలాగే 2019 ముందు వరకు ఓటమి ఎరగని నాయకుడు. అయితే 2019లో ఊహించని సంఘటనలు జరిగిన వాటిల్లో నరేంద్ర ఓటమి కూడా ఒకటి...ఈయన ఓటమిని టీడీపీ శ్రేణులే కాదు...ప్రత్యర్ధి పార్టీ శ్రేణులు కూడా ఊహించి ఉండరు.

కానీ అయిదుసార్లు వరుసగా గెలుస్తూ...డబుల్ హ్యాట్రిక్ కొట్టాల్సిన నరేంద్ర పొన్నూరు బరిలో ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా నరేంద్రపై రాజకీయాల్లో జూనియర్ నేత కిలారు రోశయ్య విజయం సాధించారు...ఇక ఈయన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు అనే సంగతి తెలిసిందే. అయితే ఉమ్మారెడ్డి సపోర్ట్‌తో రోశయ్య పొన్నూరు సీటు దక్కించుకోవడమే కాకుండా..గెలిచారు కూడా. నరేంద్రపై గెలవడం అంటే మాటలు కాదనే చెప్పాలి..కానీ ఇలాంటి విజయాలు అరుదుగా వస్తుంటాయి. ఇలా అరుదైన విజయాలు వచ్చినప్పుడు వాటిని ఇంకా ఎక్కువ కాలం నిలబెట్టుకోవడానికి చూడాలి.

రోశయ్య మాత్రం ఆ దిశగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు...ఇప్పుడు గెలిచాం కాబట్టి...ఇప్పుడే చాలులే ఉన్నట్లు కనిపిస్తున్నారు. నెక్స్ట్ గెలవాలంటే పొన్నూరు ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే విషయాన్ని వదిలేసినట్లు తెలుస్తోంది. అందుకే తక్కువ సమయంలోనే పొన్నూరులో నరేంద్ర పికప్ అయిపోయారు. పైగా ఆయనని జైల్లో పెట్టడం వైసీపీకే నెగిటివ్ అయినట్లు కనబడుతోంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో పొన్నూరులో నరేంద్ర లీడింగ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఈ పరిస్తితి ఇలాగే కంటిన్యూ అయితే...నెక్స్ట్ పొన్నూరులో నరేంద్రని ఓడించడం అంత ఈజీ కాదు...పైగా ఈ సారి జగన్ గాలి కూడా తగ్గుతుంది...అటు ఎమ్మెల్యే పరిస్తితి కూడా అంత ఆశాజనకంగా లేదు. ఈ క్రమంలోనే నెక్స్ట్ పొన్నూరులో వైసీపీ అభ్యర్ధి మారే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం మొదలైంది..మళ్ళీ కమ్మ నేతనే ఇక్కడ బరిలో పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారి పొన్నూరు బరిలో ధూళిపాళ్ళ ప్రత్యర్ధి మారతారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: