ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి...ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా సరే..ఇప్పటినుంచే ఎన్నికల గురించి చర్చలు నడిచిపోతున్నాయి..నెక్స్ట్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా..చంద్రబాబు గెలుస్తారా? అసలు పవన్ కల్యాణ్ ఈ సారైనా సత్తా చాటుతారా? అలాగే టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందా? రెండు పార్టీలు కలిస్తే ఏంటి? కలవకపోతే ఎలా ఉంటుంది? అనే అంశాలపై చర్చలు నడుస్తున్నాయి.

ఏది ఎలా ఉన్నా సరే వైసీపీ-టీడీపీల మధ్యే పోటీ నడుస్తోంది...ఇందులో ఎలాంటి డౌట్ లేదు...ఇక్కడ జనసేనకు మూడో ప్లేస్ మాత్రమే. మిగిలిన పార్టీలని లెక్కలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సరే ఆ రెండు పార్టీల్లోనే ఏదొక పార్టీ అధికారంలోకి రావాలి...ఇక్కడ కూడా డౌట్ లేదు. అయితే జనసేన పరిస్తితి ఏంటి? అనేది చర్చకు వస్తే..టీడీపీతో పొత్తు ఉంటే ఒకలా...లేకపోతే మరొకవిధమైన ఫలితాలు రావడం గ్యారెంటీ.

ఇక ఇక్కడ పొత్తు వల్ల అటు టీడీపీకి, ఇటు జనసేనకు బెనిఫిట్ ఉంటుంది...ఈ విషయం క్లియర్ అని చెప్పొచ్చు. ఎంత కాదు అనుకున్న పొత్తు వల్ల ప్లస్సే. పొత్తు లేకపోతే రెండు పార్టీలకు మైనస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రజలు వైసీపీ వర్సెస్ టీడీపీగానే చూస్తారు కాబట్టి అప్పుడు జనసేనకే ఎక్కువ నష్టం. అసలు ఆ పార్టీ సింగిల్‌గా పోటీ చేస్తే సింగిల్ డిజిట్ సీట్లు దాటడం కష్టమని చెప్పొచ్చు. ఈ విషయంలో కూడా ఎలాంటి డౌట్ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


బీజేపీతో పొత్తు ఉన్నా సరే పావలా ప్రయోజనం లేదు. కాబట్టి జనసేన గట్టిగా కష్టపడితే 10 సీట్లు దాటడం కష్టం..అసలు 5 సీట్లు గెలిస్తే గ్రేట్ అని అంటున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే, అప్పుడు పరిస్తితి బట్టి రాజకీయం మారే అవకాశం ఉంది. కానీ పొత్తు లేకపోతే మాత్రం జనసేనకు సింగిల్ డిజిట్ దాటడం చాలా కష్టమని చెప్పొచ్చు. మరి చూడాలి నెక్స్ట్ పొత్తు విషయంలో జనసేన ఎలాంటి స్టెప్ వేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: