‘విడవమంటే పాముకు కోపం...కరవమంటే కప్పుకు కోపం’ అనే సామెత ఏపీలోని ట్రెజరీ ఉద్యోగులకు బాగా సరిపోతుంది. పీఆర్సీ రివిజన్, హెచ్ఆర్ఏ తదితర డిమాండ్ల సాధన విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వివాదం బాగా పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. సమ్మెకు పిలిపిచ్చిన ఉద్యోగసంఘాల నేతలు బాగానే ఉన్నారు. 23వ తేదీనుండి ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు కాబట్టి ఉద్యోగ నేతల బాధ్యత తీరిపోయింది. ఉద్యోగనేతలను అనుసరిస్తున్న ఉద్యోగులూ బాగానే ఉన్నారు.
ఎటొచ్చీ ఇపుడు ఇరుక్కుపోయింది మాత్రం ట్రెజరీ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికీ లేని సమస్య ఒక్క ట్రెజరీ ఉద్యోగులకు మాత్రమే వచ్చిపడింది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నది ఫిబ్రవరి 7వ తేదీనుండి. ఈలోపు వివిధ దశల్లో ఆందోళనలకు పిలుపిచ్చినా ఆందోళనల సమయాన్ని వదిలేస్తే మిగిలిన సమయాల్లో ఉద్యోగాలకు హాజరవ్వాల్సిందే. ఇక్కడే సమస్య మొదలైంది.
ఉద్యోగులకు జీతాలు అందాలంటే ప్రతినెలా 25వ తేదీనుండి బిల్లులు ప్రాసెస్ చేయాల్సుంటుంది. వివిధ దశల్లో ప్రాసెస్ అయిన బిల్లులు ట్రెజరీలకు చేరుకుంటాయి. అక్కడి నుండి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమవుతాయి. ఇపుడు ప్రభుత్వం ఈనెల 25వ తేదీకే జీతాలు ప్రాసెస్ చేయమని ఆదేశాలిచ్చింది. వివిధ శాఖల నుండి బిల్లులు ప్రాసెస్ అయితే 28వ తేదీకల్లా ట్రాజరీలకు వెళ్ళిపోవాలి. ఇపుడు బిల్లులు ప్రాసెస్ కాకపోతే బిల్లులు ట్రెజరీలకు వెళ్ళవు. అక్కడి నుండి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమకావు.
మిగిలిన ఉద్యోగుల్లాగ ట్రెజరీ ఉద్యోగులు సమ్మె కారణంగా పనిచేసేది లేదని చెప్పేందుకు లేదు. ఎందుకంటే సమ్మెలోకి వెళ్ళేది ఫిబ్రవరి 7వ తేదీనుండి. కాబట్టి ఈలోగా వాళ్ళు చేయాల్సిన పని చేసి తీరాల్సిందే. అలా కాదని పని చేసేది లేదంటే సర్వీసు రూల్సుకు విరుద్ధంగా వెళుతున్నట్లు లెక్క. కాబట్టి వాళ్ళపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ బిల్లుల ప్రాసెసింగ్ చేస్తే కొత్త పీఆర్సీ పద్దతిలోనే చేయాల్సుంటుంది. ట్రెజరీ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారమే బిల్లులు ప్రాసెస్ చేస్తే జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారమే బ్యాంకుల్లో జమవుతాయి.
దీంతో ఉద్యోగనేతలు, ఉద్యోగులు మండిపోతారు. తాము పాత పీఆర్సీ కావాలని ఒకవైపు ఉద్యమం చేస్తుంటే ట్రెజరీ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులను ఎలా ప్రాసెస్ చేస్తారంటు వాయించేస్తారు. అంటే ఒకవైపు సమ్మె పిలుపు ప్రకారం పనిచేయాలి మరోవైపు ప్రభుత్వం చెప్పినట్లు కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు ప్రాసెస్ చేయకపోతే సర్వీసు రూల్సును ఉల్లంఘించినట్లు. దీంతో ఏమి చేయాలో తెలీక ట్రెజరీ ఉద్యోగులంతా తలలు పట్టుకుంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: