బీజేపీ చీఫ్ బండిసంజయ్ దీక్షను  పోలీసులు భగ్నం చేశారు. దాంతో బండి కొంతమందిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇపుడా పార్లమెంటు ప్రివిలేజ్ కమిటి తెలంగాణా చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కరీంనగర్ పోలీసు కమీషనర్ తో పాటు మరో ముగ్గురికి నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 3వ తేదీ తమ విచారణకు హాజరు కావాలంటు అందరినీ ఆదేశించింది. పైకి ఇది మామూలు విచారణగానే కనిపిస్తున్నా లోలోపల చాలా పెద్ద విషయమే ఉన్నట్లుంది.
ప్రివిలేజ్ కమిటి అంటే కేంద్రంలోని బీజేపీ ఎంపీల చేతిలోనే పెత్తనమంతా ఉంటుంది. రేపటి విచారణలో చీఫ్ సెక్రటరీ, డీజీపీలు హాజరైతే ఒక సమస్య హాజరుకాకపోతే మరో సమస్య. హాజరైతేనేమో దీక్ష చేస్తున్న పార్టీ కార్యాలయంలోకి ధౌర్జన్యంగా ఎందుకు ప్రవేశించాల్సొచ్చింది ? ఎందుకని చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళాల్సొచ్చిందో వివరణివ్వాలి. దీక్ష లేదా నిరసన తెలపటమన్నది  ప్రతి మనిషికి ఉన్న ప్రాధమిక హక్కు. బండి ఎంపీ కదా ఇంకాస్త ఎక్కువే హక్కులుంటాయి.
తన హక్కులకు భంగం కలిగించారనే కదా బండి వీళ్ళపై ఫిర్యాదు చేసింది. తనను పోలసులు ధౌర్జన్యంగా లాక్కెళ్ళిన వీడియోలు కూడా అందించారు.  వాటిని పోలీసులు కాదనేందుకు లేదు. కాబట్టి తాము అలా ఎందుకు వ్యవహరించాల్సొచ్చిందో వివరణ ఇవ్వాల్సుంటుంది. తమంతట తాముగానే అలా వ్యవహరించామంటే కచ్చితంగా ఎంపీ హక్కులకు భంగం కలిగించారంటు వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలని సిఫారసు చేస్తుంది కమిటి.
ఒకవేళ పలానా వాళ్ళు చెప్పబట్టే తాము అలా చేశామని చెబితే అదింకో పెద్ద సమస్యకు దారితీస్తుంది. పోనీ అసలు విచారణకే డుమ్మా కొడదామంటే అదింకా పెద్ద సమస్యవుతుంది. మొత్తం మీద బండి ఫిర్యాదు వెనుక అసలు విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతల జోలికి రావాలంటే పోలీసులు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. రేపటి నుండి బీజేపీ చేసే ప్రతి ఆందోళనలోను ముందు కమలంపార్టీ ఎంపీలే నిలబడతారు. వీళ్ళని టచ్ చేయాలంటేనే పోలీసులు వణికిపోవాలి. మొత్తానికి కేసీయార్ ను ఏదోరకంగా ఇబ్బందులు పెట్టడమే బీజేపీ నేతల అసలు ప్లాన్ లాగుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: