తూర్పు గోదావరి జిల్లా అంటే కాపుల బలం ఎక్కువ ఉన్న జిల్లా అనే సంగతి అందరికీ తెలిసిందే. జిల్లాలో కాపులే రాజకీయంగా బలమైన శక్తి...వారే జిల్లాలో గెలుపోటములని ప్రభావితం చేయగలరు. కాపులు ఎవరి వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ గెలుపు ఖాయమే. ఇక ఇక్కడ కాపులతో బీసీ వర్గంలో కీలకంగా ఉన్న శెట్టిబలిజలు సైతం బలమైన వర్గంగా ఉంది..అలాగే ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

అయితే తూర్పులో కమ్మ గాని, రెడ్డి వర్గాల ప్రభావం చాలా తక్కువ. కాకపోతే టీడీపీ ఏమో కమ్మ వర్గానికి, వైసీపీ ఏమో రెడ్డి వర్గానికి బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్లు ఉన్నాయి. కాబట్టి జిల్లాలో కమ్మ నేతలు, రెడ్డి నేతలు ఉన్నారు. తూర్పు వైసీపీలో ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు ఉండగా, ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డిలు ఉన్నారు..వీరు వైసీపీ ఎమ్మెల్యేలు.

ఇటు టీడీపీ విషయానికొస్తే రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరి, మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావులు ఉన్నారు. ఇలా రెండు వర్గాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే రాజానగరం టీడీపీ బాధ్యతలని కమ్మ వర్గానికి చెందిన పెందుర్తి వెంకటేష్ చూసుకుంటున్నారు. అంటే టీడీపీలో ముగ్గురు కమ్మ నేతలు, వైసీపీలో ఇద్దరు రెడ్డి నేతలు ఉన్నారు. మరి ఈ నేతల్లో ఎవరు వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతారు అంటే? ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో అందరికీ గట్టి పోటీ ఉన్నట్లే కనిపిస్తోంది. కమ్మ నేతల్లో వేగుళ్ళ, పెందుర్తిలకు గట్టి పోటీ ఉంది. బుచ్చయ్య చౌదరి పరిస్తితి బాగానే ఉంది.

ఇక రెడ్డి ఎమ్మెల్యేలు ఇద్దరికి గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది..ఈ సారి మాత్రం టీడీపీ-జనసేనలు కలిస్తే ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు ఓటమి అంచుకు చేరుకోవడం ఖాయం. మొత్తానికైతే తూర్పులో రెడ్డి, కమ్మ నేతల పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: